Karthikeya 2 : ప్రశంసలు కురిపించిన ఇస్కాన్ కాల్గరీ

ABN , First Publish Date - 2022-08-17T22:45:41+05:30 IST

నిఖిల్ సిద్ధార్ధ్ (Nikhil Siddharth), అనపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా చందు మొండేటి తెరకెక్కించిన స్పిరిట్యువల్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ (Karthikeya 2). ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్ళతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Karthikeya 2 : ప్రశంసలు కురిపించిన ఇస్కాన్ కాల్గరీ

నిఖిల్ సిద్ధార్ధ్ (Nikhil Siddharth), అనపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా చందు మొండేటి తెరకెక్కించిన స్పిరిట్యువల్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ (Karthikeya 2). ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్ళతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.  బాలీవుడ్ లోనూ ఈ సినిమాకి అనూహ్యమైన ప్రజాదరణ దక్కింది. అక్కడ రెగ్యులర్ సినిమాల్ని తలదన్నే రీతిలో కలెక్షన్స్ కురిపిస్తూ ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా విజయాన్ని ప్రశంసిస్తూ .. ఇస్కాన్ కాల్గరీ (ISCON) వారు ‘కార్తికేయ 2’ టీమ్ కు ఒక రికమెండేషన్ లెటర్ పంపారు. 


‘శ్రీకృష్ణుని తత్వాన్ని, ఆయన జీవిత విశేషాల్ని, మహిమను ఆవిష్కరిస్తూ ‘కార్తికేయ 2’ చిత్రాన్ని నిర్మించినందుకు చిత్ర బృందానికి అభినందనలు. చరిత్రకారులు ఎప్పుడూ రామయణ, మహాభారతాల్ని పురాణాల నుంచి పుట్టిన కథలుగానే భావిస్తారు, కానీ అది నిజం కాదు. 1984లో సముద్రగర్భంలో ఉన్న ద్వారాకా నగరాన్ని  పురాతత్వ శాఖ కూడా కనుగొంది. వారు మొత్తం ద్వారాకా నగరాన్ని వెలికితీశారు. ‘కార్తికేయ 2’ చిత్రం దాని ఆధారంగానే తెరకెక్కింది. రామాయణ, మహాభారతాలు మన చరిత్ర. ఇవే మన చారిత్రక గ్రంధాలు. ‘కార్తికేయ 2’ లాంటి అద్బుత చిత్రాన్ని తీసినందుకు  చిత్ర బృందానికి కృతజ్ఞతలు. మీకు శ్రీశ్రీ రాధా మాధవ స్వామీజీ ఆశీస్సులు ఉంటాయి. ఈ చిత్ర విజయానికి చిత్ర బృందానికి మా అభినందనలు. భవిష్యత్ లో కూడా శ్రీకృష్ణుని తత్వంపై చిత్రాలు తీసి ప్రపంచానికి తెలియచేయాని కోరుతున్నాం. 


దివ్యక్షేత్రమైన బృందావన్ లోని ఇస్కాన్ టెంపుల్ లో  ఈ సినిమా టీజర్ ను విడుదల చేసినందుకు మీకు అభినందనలు. మీరు భవిష్యత్ లో మరిన్ని చిత్రాలు తీయాలని, ఆ శ్రీకృష్ణుడు మీ వెంటే ఉంటూ మిమ్మల్ని గైడ్ చేయాలని కోరుకుంటున్నాం’ అంటూ ఆ లేఖలో తెలిపారు. దాంతో కార్తికేయ 2 చిత్ర బృందం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-17T22:45:41+05:30 IST