'సలార్' ట్రీట్ ఉందా లేదా..కన్‌ఫ్యూజన్‌లో ఫ్యాన్స్..!

ABN , First Publish Date - 2022-04-10T13:46:56+05:30 IST

'సలార్' ట్రీట్ ఉందో లేదో తెలియక డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ నెల 14వ తేదీన ప్రశాంత్ నీల్ - కన్నడ రాకింగ్ స్టార్ కాంబినేషన్‌లో

'సలార్' ట్రీట్ ఉందా లేదా..కన్‌ఫ్యూజన్‌లో ఫ్యాన్స్..!

'సలార్' ట్రీట్ ఉందో లేదో తెలియక డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ నెల 14వ తేదీన ప్రశాంత్ నీల్ - కన్నడ రాకింగ్ స్టార్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కేజీఎఫ్ 2' పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతోంది. సౌత్ భాషలతో పాటుగా హిందీలో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే, అదేరోజు ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'సలార్' సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల ఓ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేరుగా ఈ టీజర్ కేజీఎఫ్ 2 ప్రదర్శింపబడే థియేటర్స్‌లో రిలీజ్ చేస్తారని ప్రచారం అవుతోంది. ఈ విషయంలో కొందరు నిజమే అంటే లేదు ఇది కేవలం గాసిప్ మాత్రమే అని కొందరు అంటున్నారు. దాంతో అసలు 'సలార్' సినిమా నుంచి టీజర్ ట్రీట్ ఉందా లేదా అని ప్రభాస్ కంఫ్యూజ్ అవుతూ మేకర్స్‌ను క్లారిటీ ఇవ్వమని కోరుతున్నారు. మరి దీనిపై స్పందించి మేకర్స్ ఏం క్లారిటీ ఇస్తారో ఎప్పుడిస్తారో చూడాలి. కాగా, 'సలార్' సినిమా షూటింగ్ సగం పూర్తైనట్టు తెలుస్తోంది. హోంబలే సంస్థలో విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్. 

Updated Date - 2022-04-10T13:46:56+05:30 IST