Rashmika Mandanna: క్రేజీ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందా..?

ABN , First Publish Date - 2022-09-29T20:51:19+05:30 IST

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటి రష్మిక మందన్న (Rashmika Mandanna). ‘పుష్ప’ తో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అందరికి చేరువైంది.

Rashmika Mandanna: క్రేజీ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందా..?

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటి రష్మిక మందన్న (Rashmika Mandanna). ‘పుష్ప’ తో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అందరికి చేరువైంది. ఈ చిత్రంలో శ్రీ వల్లీగా కనిపించి అందరిని మెస్మరైజ్ చేసింది. ‘పుష్ప’ తో రష్మికకు యూత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల బాలీవుడ్ మేకర్స్ ఆమెను సంప్రదిస్తున్నారు. తమ సినిమాల్లో నటించాలని కోరుతున్నారు. తాజాగా రష్మిక‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంది. క్రేజీ ప్రాజెక్టులో ఆమె నటించే అవకాశం ఉందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. నిర్మాతలు ఆమె‌తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.    


బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రేమ కథా చిత్రాలు ‘ఆషికి’ (Aashiqui) ‘ఆషికి-2’ (Aashiqui-2). రొమాంటిక్ మ్యూజికల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. ‘ఆషికి-2’ ను రూ.18కోట్ల‌తో రూపొందిస్తే రూ. 110కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి మూడో భాగాన్ని రూపొందిస్తున్నామని కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. ‘ఆషికి-3’ (Aashiqui-3) అని టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరో పాత్రను చేస్తున్నాడు. అనురాగ్ బసు (Anurag Basu) దర్శకత్వం వహిస్తున్నాడు. భూషణ్ కుమార్, ముఖేశ్ భట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలోనే హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ రష్మికతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. కార్తిక్, రష్మిక జోడీ వెండితెరపై కనిపిస్తే కొత్తగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఆమెకు ఇండియా అంతట భారీ క్రేజ్ ఉండటంతో సినిమాకు కూడా బజ్ వస్తుందని మేకర్స్ అనుకుంటున్నారట. అందువల్ల హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. కార్తిక్ ఆర్యన్ గతంలో కియారా అడ్వాణీ, అనన్య పాండే, కృతి సనన్‌లతో కలసి సినిమాలు చేశాడు. అందువల్ల కొత్త హీరోయిన్‌గా రష్మికకు ఛాన్స్ ఎక్కువగా ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే.. ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ షూటింగ్‌లను గతంలోనే పూర్తి చేసింది. ఈ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ‘పుష్ప-2’ సెట్స్‌లోకి ఆమె త్వరలోనే అడుగుపెట్టే అవకాశం ఉంది. 

Updated Date - 2022-09-29T20:51:19+05:30 IST