ఇండియన్ వెర్షన్ చార్లీ చాప్లిన్‌గా రణ్‌‌వీర్ సింగ్..!

ABN , First Publish Date - 2022-04-18T02:37:05+05:30 IST

ఎటువంటి అండదండలు లేకుండా స్వ శక్తితో ఎదిగిన నటుడు రణ్‌వీర్ సింగ్. ‘పద్మావత్’, ‘బాజీ రావ్ మస్తానీ’, 'సింబా’, ‘గల్లీ భాయ్’ వంటి సినిమాలతో అభిమానులను అలరించాడు.

ఇండియన్ వెర్షన్ చార్లీ చాప్లిన్‌గా రణ్‌‌వీర్ సింగ్..!

ఎటువంటి అండదండలు లేకుండా స్వ శక్తితో ఎదిగిన నటుడు రణ్‌వీర్ సింగ్. ‘పద్మావత్’, ‘బాజీ రావ్ మస్తానీ’, 'సింబా’, ‘గల్లీ భాయ్’ వంటి సినిమాలతో అభిమానులను అలరించాడు. ఎటువంటి పాత్రను అయినా రణ్‌వీర్ అలవోకగా పోషించగలడు. అతడు తాజాగా నటించిన చిత్రం ‘జయేష్ భాయ్ జోర్దార్’. దివ్యాంగ్ ఠక్కర్ అనే కొత్త దర్శకడు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చిత్ర బృందం ఒక్క అప్‌డేట్‌ను కూడా బయటికి వెల్లడించలేదు. అత్యంత రహస్యంగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 


‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమా సోషల్ కామెడీగా తెరకెక్కిన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ టైటిల్ రోల్‌ పోషిస్తున్నాడు. చార్లీ చాప్లిన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో హీరో పాత్రను రూపొందించారట. ఈ మూవీలోని రణ్‌వీర్ పాత్రను చూసి అభిమానులు సర్‌ప్రైజ్‌కు గురవుతారట. ఈ చిత్రం ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుందని బీ టౌన్ వర్గాలు తెలుపుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ‘అర్జున్ రెడ్డి’ భామ షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి సినిమా. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మే 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. గుజరాత్ బ్యాక్ గ్రౌండ్‌గా ఈ చిత్రం రూపొందిందని తెలుస్తోంది.

Updated Date - 2022-04-18T02:37:05+05:30 IST