‘Brahmastra’ లో షారుఖ్ ఖాన్ వాయువుగా కనిపించనున్నాడా..?

ABN , First Publish Date - 2022-06-15T21:57:57+05:30 IST

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్( Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు.

‘Brahmastra’ లో షారుఖ్ ఖాన్ వాయువుగా కనిపించనున్నాడా..?

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్( Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్(Karan Johar) నిర్మాతగా వ్యవహరించాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’  ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేశారు. ఈ సినిమాను భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ విడుదల కాగానే అభిమానులు అవాక్కయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారని కామెంట్స్ చేస్తున్నారు. 


‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌లో షారూఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)ను ఎక్కడ చూపించలేదు. కానీ, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి అతడు కింగ్ ఖానే అని అభిమానులు అంటున్నారు. కొంత మంది స్క్రీన్‌‌షాట్స్ తీసి సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. చిత్ర బృందం మాత్రం బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్టు ఇంత వరకు అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. ‘బ్రహ్మాస్త్ర’ లో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌనీరాయ్, అక్కినేని నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు. 



Updated Date - 2022-06-15T21:57:57+05:30 IST