Samantha: అక్కడ స్ట్రైట్ మూవీకి గ్రీన్ సిగ్నల్..?

ABN , First Publish Date - 2022-06-08T15:31:35+05:30 IST

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలపై గట్టిగా ఫోకస్ పెట్టారు స్టార్ హీరోయిన్ సమంత (Samantha). అంతేకాదు, ఏ ఇంటర్‌నేషనల్ యాడ్ ఫిల్మ్ కూడా వదలడం లేదు.

Samantha: అక్కడ స్ట్రైట్ మూవీకి గ్రీన్ సిగ్నల్..?

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలపై గట్టిగా ఫోకస్ పెట్టారు స్టార్ హీరోయిన్ సమంత (Samantha). అంతేకాదు, ఏ ఇంటర్‌నేషనల్ యాడ్ ఫిల్మ్ కూడా వదలడం లేదు. తనవద్దకు అవకాశం రావాలేగానీ, నచ్చితే వదిలే ప్రసక్తే లేదనేట్టుగా చక చకా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సమంత తాజాగ ఓ క్రేజీ మూవీకి ఒకే చెప్పినట్టు తాజా సమాచారం. ఈ మధ్య సమంత (Samantha) ఓవర్ ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి కూడా వెనకాడటం లేదు.


సినిమాలో ఐటమ్ సాంగ్ అయినా కవర్ పేజీ కోసమైనా హాట్‌గా ఫోలివ్వడానికి, అందాల ఆరబోతతో ఐటెమ్ సాంగ్‌లో హీటెక్కించడానికి రెడీ అంటున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప' (Pushpa)లో ఊ అంటావా అంటూ హాట్ హాట్ అందాలతో ఒక ఊపు ఊపేసిన సమంత.. ఇటీవల 'కణ్మణి రాంబో ఖతీజా' (Kanmani Rambo Khatheeja) చిత్రంలోనూ అంతే హాట్‌గా నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు పాన్ ఇండియా చిత్రాలు.. హిందీ, తమిళ భాషలలో ఒక్కో సినిమా ఉన్నాయి.


ఈ క్రమంలోనే తాజాగా ఓ మలయాళ చిత్రంలో నటించేందుకు ఒకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలైన మోహన్ లాల్ (Mohan Lal), మమ్ముట్టి (Mammutti) లాంటి వారితో అద్భుతమైన సినిమాలు రూపొందించిన ప్రముఖ సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ (Shaji Kailas) 'పింక్ పోలీస్' (Pink Police) అనే టైటిల్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందబోతుందని తెలుస్తుంది. ఇందులో సమంత (Samantha)ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. కథ కూడా ఇప్పటికే విన్న సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది. ఇప్పటివరకు సమంత మలయాళంలో స్ట్రైట్ సినిమా చేయలేదు. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుందంటున్నారు.  

Updated Date - 2022-06-08T15:31:35+05:30 IST