#RC 15: సంక్రాంతి నుంచి సమ్మర్‌కు షిఫ్ట్..?

ABN , First Publish Date - 2022-05-25T17:44:40+05:30 IST

ఆర్ఆర్ఆర్ (RRR), ఆచార్య (Acharya) సినిమాలతో వచ్చిన మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) ఓ భారీ పాన్ ఇండియా హిట్ ఓ యావరేజ్ హిట్ అందుకున్నారు.

#RC 15: సంక్రాంతి నుంచి సమ్మర్‌కు షిఫ్ట్..?

ఆర్ఆర్ఆర్ (RRR), ఆచార్య (Acharya) సినిమాలతో వచ్చిన మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) ఓ భారీ పాన్ ఇండియా హిట్ ఓ యావరేజ్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం శంకర్ (Sankar) దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిసున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) మొదటిసారి అత్యంత భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు. 


ఈ పాటికే చాలావరకూ ఆర్సీ 15 చిత్రానికి సంబంధించిన టాక్ పార్ట్ పూర్తవ్వాల్సింది. కానీ, చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల ప్రమోషన్స్ కోసం బాగానే బ్రేక్ ఇచ్చారు. దీనివల్ల కొంత ఆలస్యం అయితే, శంకర్ క్రియేటివిటీకి తగ్గట్టు అవుట్‌పుట్ రాకపోతే..మళ్ళీ మళ్ళీ తీసిన సీన్సే తీస్తుంటారు. మేకింగ్ విషయంలో ఆయన అస్సలు కాంప్రమైజ్ కారనే విషయం అందరికీ తెలిసిందే. చిత్రీకరణ కోసమే కాదు, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కోసం ముఖ్యంగా వీఎఫెక్స్ కోసం చాలా సమయం తీసుకుంటారు.


ఇప్పుడు కూడా ఆర్సీ 15కి ఇలాగే ఎక్కువ సమయం తీసుకుంటున్నారట. ఇప్పటికే చిత్ర నిర్మాత దిల్ రాజు 2023, సంక్రాంతి సీజన్‌లు ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. స్వయంగా ఈ విషయాన్ని ఆయన చెప్పారు కూడా. కానీ, ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం దిల్ రాజు చెప్పినట్టు సంక్రాంతికి కాకుండా 2023 సమ్మర్‌కు రిలీజ్ డేట్ మారే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి శంకర్.. దిల్ రాజు అనుకున్న సమయానికి చిత్రాన్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా.. లేదా వాయిదా పడుతుందా. ఇక ఈ సినిమాలో అంజలి, నవీన్ చంద్ర, జయరాం, సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2022-05-25T17:44:40+05:30 IST