'హరిహర వీరమల్లు': మరో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కూడానా..?

ABN , First Publish Date - 2022-04-24T17:33:00+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

'హరిహర వీరమల్లు': మరో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కూడానా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో భారీ యాక్షన్స్ సీన్స్, టాకీపార్ట్ కంప్లీట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్..ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు వీరమల్లు సినిమాలో మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా నటించబోతుందట. ఇప్పటికే నోరా.. టాలీవుడ్‌లో బాహుబలి, టెంపర్, ఊపిరి, లోఫర్ చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హారిహర వీరమల్లులో' కీలక పాత్రను చేసే అవకాశం అందుకుందని సమాచారం. మరి దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి. 

Updated Date - 2022-04-24T17:33:00+05:30 IST