కరోనా నుంచి Kollywood కోలుకున్నట్టేనా?

ABN , First Publish Date - 2022-05-26T18:52:30+05:30 IST

కరోనా (Carona) మహమ్మారి కారణంగా గత రెండేళ్ళుగా కోలీవుడ్‌ (Kollywood) కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఒకవైపు కరోనా, ఇంకోవైపు ఈ వైరస్‌ భయంతో ప్రేక్షకులు థియేటర్‌కు ముఖం చాటేయడం,

కరోనా నుంచి Kollywood కోలుకున్నట్టేనా?

కరోనా (Carona) మహమ్మారి కారణంగా గత రెండేళ్ళుగా కోలీవుడ్‌ (Kollywood) కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఒకవైపు కరోనా, ఇంకోవైపు ఈ వైరస్‌ భయంతో ప్రేక్షకులు థియేటర్‌కు ముఖం చాటేయడం, చిన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ లేకపోవడం వంటి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ యేడాది ఆరంభంలో కరోనా థర్డ్‌వేవ్‌ భయపెట్టినప్పటికీ ఆ తర్వాత అంతా సర్దుకుంది. గత ఐదు నెలలుగా పలు చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి. ప్రధానంగా, ఫిబ్రవరి నుంచి రిలీజైన చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ‘వలిమై’ (Valimai), ‘ఎదర్కుం తుణిందవన్‌’, ‘బీస్ట్‌’ (Beast) వంటి చిత్రాలు కలెక్షన్ల పరంగా సక్సెస్‌ సాధించినప్పటికీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. 


కానీ, ‘ఎఫ్‌ఐఆర్‌’, (FIR) ‘మన్మథలీలై’, (Manmadha Leelai) ‘సెల్ఫి’, (Selfy) ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ (Kaathuvaakula Rendu Kaadhal), ‘డాన్‌’ (Don) వంటి చిత్రాలు ఇటు కలెక్షన్లతో మంచి టాక్‌తో ప్రేక్షకులను మెప్పించాయి. అదేసమయంలో ఇతర భాషల నుంచి తమిళంలోకి డబ్‌ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), ‘కేజీఎఫ్‌-2’ (KGF 2) చిత్రాలు తమిళ చిత్రాలకు ధీటుగా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపించాయి. పైగా గత రెండు మూడు నెలల్లోగా వరుసగా చిత్రాలు థియేటర్లలో విడుదలవుతూ ఆరోగ్యకరమైన వాతావరణ నెలకొంది. 


ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తున్నారు. అదేసమయంలో కొత్త చిత్రాల ప్రారంభోత్సవాలు, షూటింగులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్రపరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కరోనా మహమ్మారి నుంచి కోలీవుడ్‌ మళ్ళీ కోలుకున్నట్టేనని అంటున్నారు. పెద్ద హీరోల చిత్రాలతో పాటు ఇతర నటీనటులు నటించిన చిన్న‌, మీడియం బడ్జెట్‌ చిత్రాలు కూడా థియేటర్లలో విడుదల కావడం మంచి శుభపరిణామంగా కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2022-05-26T18:52:30+05:30 IST