కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా..?

ABN , First Publish Date - 2022-04-11T21:45:35+05:30 IST

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయదళపతి విజయ్

కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా..?

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయదళపతి విజయ్. తాజాగా అతడు ‘బీస్ట్’ సినిమాలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అందులో భాగంగా విజయ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులకు తెలిపాడు. 


విజయ్ కొడుకు జేసన్ సంజయ్ కోసం ‘ప్రేమమ్’ డైరెక్టర్ అల్ఫోన్స్ పుతారెన్ ఓ కథను వినిపించాడట. కానీ, ఆ సినిమాపై తాను ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. ఆ సినిమా చేయలా.. వద్దా..? అనే విషయాన్ని తన కొడుకుకే వదిలివేశానన్నాడు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జేసన్‌కు మాత్రం ఇష్టం లేదన్నాడు. జేసన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను గౌరవిస్తానని స్పష్టం చేశాడు. గత కొన్నాళ్లుగా జేసన్ విజయ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి జేసన్‌ను లాంచ్ చేస్తాడనే వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ, ఆ వార్తలేవీ నిజం కాలేదు. స్టార్ హీరో విజయ్‌కు, సంగీతతో 1999లో పెళ్లి అయింది. ఈ దంపతులకు జేసన్ విజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు.

Updated Date - 2022-04-11T21:45:35+05:30 IST