Suriya- బాల సినిమా ఆగిపోయిందా..?
ABN , First Publish Date - 2022-05-26T02:13:26+05:30 IST
విలక్షణ పాత్రలు చేస్తూ విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు సూర్య (Suriya). ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. బాల(Bala)
విలక్షణ పాత్రలు పోషిస్తూ విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు సూర్య (Suriya). ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. బాల(Bala) తెరకెక్కించిన ‘నంద’ (Nandhaa) సినిమాతో ఆయనకు హీరోగా బిగ్ బ్రేక్ వచ్చింది. అనంతరం వీరిద్దరు కలసి ‘శివపుత్రుడు’ (siva putrudu)కు పనిచేశారు. ఈ చిత్రం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను బంపర్ హిట్ కొట్టింది. బాల దర్శకత్వం వహించిన అనేక మూవీస్‌లో కూడా సూర్య అతిథి పాత్రలో మెరిశారు. సూర్య, బాలల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో మూడోసారి మరో సినిమాకు కలసి పనిచేయబోతున్నట్టు కొన్ని నెలల క్రితం ప్రకటించారు. ఆ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘సూర్య41’ (Suriya 41) అని వ్యవహరిస్తున్నారు. షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉండగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్‌లో షికార్లు కొడుతుంది.
సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్(2D Entertainment) ‘సూర్య41’ను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. కానీ, ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందని కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాల పర్‌ఫెక్షన్‌కు మారుపేరు. అందువల్ల సీన్స్‌ను పదేపదే రీషూట్ చేస్తున్నారట. ఇప్పటి వరకు సూర్య, కృతి శెట్టిలకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను మాత్రమే షూట్ చేశారంట. దీంతో సూర్య, బాలల మధ్య సృజనాత్మక విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. అందువల్ల షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. చిత్రం పూర్తిగా ఆగిపోలేదని ప్రస్తుతానికైతే వాయిదా పడిందని సూర్యతో సన్నిహితంగా మెలిగేవారు చెబుతున్నారు. ఈ బ్రేక్‌లో బాల కొంచెం సమయం తీసు్కుని స్క్రీప్ట్‌ను రీరైట్ చేస్తారని, అనంతరం షూటింగ్ ప్రారంభిస్తారని మరికొంత మంది తెలుపుతున్నారు. కానీ, ఈ వదంతులపై చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు.