SS Rajamouli తో సినిమా చేయనున్న సల్మాన్ ఖాన్..?

ABN , First Publish Date - 2021-12-21T00:03:33+05:30 IST

బాహూబలి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ ఎస్ .రాజమౌళి. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే

SS Rajamouli తో సినిమా చేయనున్న సల్మాన్ ఖాన్..?

బాహూబలి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ ఎస్ .రాజమౌళి. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. త్వరలో వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఎస్‌ఎస్ . రాజమౌళి తాజాగా దర్శకత్వం వహించిన  సినిమా ఆర్‌ఆర్‌ఆర్. రామ్ చరణ్, తారక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్  డిసెంబర్ 19న ముంబైలో ఘనంగా జరిగింది. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏ మాత్రం సంబంధం లేన‌ప్పటికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమౌళితో ఉన్న సాన్నిహిత్యంతోనే సల్మాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారయని తెలుస్తోంది. గతంలో సల్మాన్ హీరోగా నటించిన బజరంగీ భాయిజాన్ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఆ సమయంలోనే బాలీవుడ్ కండల వీరుడికి దర్శక ధీరుడితో పరిచయం అయిందని తెలుస్తోంది. సల్లూ భాయ్ కోసం జక్కన్న ఒక కథను రాయబోతున్నారని మీడియా తెలుపుతోంది.


‘‘ బాహుబలి సినిమాలకు సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యారు. రాజమౌళి సృష్టించిన ప్రపంచాన్ని చూసి అబ్బుర‌పడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ కూడా సల్లూ భాయ్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. గతంలోనే రాజమౌళితో పనిచేయడానికి ఆయన ఆసక్తి చూపారు. కానీ, దర్శకధీరుడికి అనేక కమిట్‌మెంట్స్ ఉండటంతో అది సాధ్యపడలేదు ’’ అని సల్మాన్‌తో సన్నిహితంగా మెలిగే  ఒక వ్యక్తి తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా  2022,  జనవరి 7న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవగణ్,  సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు. 

Updated Date - 2021-12-21T00:03:33+05:30 IST