సింగర్‌తో డేటింగ్ చేస్తోన్న మనోహరి భామ..?

ABN , First Publish Date - 2021-12-12T22:38:04+05:30 IST

బాలీవుడ్‌లో ఈ మధ్య ప్రేమ, పెళ్లి అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీ టౌన్ సెలెబ్రిటీలు ఒకరి తర్వాత మరకొరు పెళ్లి చేసుకుని

సింగర్‌తో డేటింగ్ చేస్తోన్న మనోహరి  భామ..?

బాలీవుడ్‌లో ఈ మధ్య ప్రేమ, పెళ్లి అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీ టౌన్ సెలెబ్రిటీలు ఒకరి తర్వాత మరకొరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ డిసెంబర్ 9న వివాహమాడారు . వచ్చే ఏడాది రణ్ బీర్ కపూర్- ఆలియా భట్ దాంపత్య జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. వీరి అడుగు జాడల్లోనే మరొకరు నడవబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 


బాహుబలి సినిమాలో మనోహరి పాటలో కనిపించి కుర్రకారుకు కునుకు లేకుండా చేసిన బాలీవుడ్ నటి నోరా ఫతేహి. ఒక సింగర్‌తో ఆమె డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గురు రంధావా అనే సింగర్‌తో ఆమె డేటింగ్  చేస్తుందని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు బయటికొచ్చాయి. నెట్టింట ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆ ఫొటోలను విపరీతంగా షేర్ చేయడం మొదలెట్టారు. ఆ ఫొటోల కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు. ‘‘ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు ’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ ఆలియా-రణ్ బీర్‌ల తర్వాత పెళ్లి చేసుకొబోయేది వీరే ’’ అని మరో నెటిజన్ స్పందించాడు. ‘‘ కొత్త జంట’’ అని కొంత మంది నెటిజన్లు తమ స్పందనను తెలిపారు. మరి వీరు పెళ్లి చేసుకుంటారా లేదా అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. 



Updated Date - 2021-12-12T22:38:04+05:30 IST