Malaika Arora, అర్జున్ కపూర్‌ ల బ్రేకప్..?

ABN , First Publish Date - 2021-12-01T22:32:56+05:30 IST

పెళ్లి, పెళ్లి బాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఈ పదమే ఎక్కువగా వినిపిస్తోంది. రాజ్ కుమార్ రావ్ -పత్ర లేఖ, ఆదిత్య సీల్-అనుష్క రంజన్

Malaika Arora, అర్జున్ కపూర్‌ ల బ్రేకప్..?

పెళ్లి, పెళ్లి బాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఈ పదమే ఎక్కువగా వినిపిస్తోంది. రాజ్ కుమార్ రావ్ -పత్ర లేఖ, ఆదిత్య సీల్-అనుష్క రంజన్ కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ డిసెంబర్ 9న పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి బాటలోనే నడుస్తూ అర్జున్ కపూర్ - మలైకా అరోరా 2022లో పెళ్లి చేసుకుంటారని అందరు అనుకున్నారు.  


అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వీరు తమ బంధానికి స్వస్తి పలికినట్టుగా బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఎందుకంటే క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలను వీరిద్దరూ కలిసి చేసుకోబోరని కథనాలు వెలువడుతున్నాయి. ఇద్దరి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని, డేటింగ్‌కి ముగింపు పలికి ఎవరి దారిని వారు చూసుకోబోతున్నారని సమాచారం. వీరిద్దరితో సన్నిహితంగా మెలిగేవారు అవన్ని పుకార్లు మాత్రమే అని చెప్పడం గమనార్హం. ‘‘మలైకా, అర్జున్ విడిపోలేదు. ప్రస్తుతం వారు బిజిగా ఉన్నారు. అర్జున్ షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు. అందువల్ల అతడు క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలను మలైకాతో కలిసి జరుపుకోవడం లేదు ’’ అని వీరి సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. 

Updated Date - 2021-12-01T22:32:56+05:30 IST