Shaktimaan పాత్రలో Ranveer Singh నటించబోతున్నాడా..?

ABN , First Publish Date - 2022-07-06T01:48:51+05:30 IST

డీడీ నేషనల్‌లో ప్రసారమయ్యి అభిమానులను అలరించిన సీరియల్ ‘శక్తిమాన్’ (Shaktimaan). ముఖేశ్ ఖన్నా(Mukesh Khanna) ఈ సీరియల్‌లో శక్తిమాన్‌గా నటించాడు. ఈ సీరియల్ 1997నుంచి 2005వరకు

Shaktimaan పాత్రలో Ranveer Singh నటించబోతున్నాడా..?

డీడీ నేషనల్‌లో ప్రసారమయ్యి అభిమానులను అలరించిన సీరియల్ ‘శక్తిమాన్’ (Shaktimaan). ముఖేశ్ ఖన్నా(Mukesh Khanna) ఈ సీరియల్‌లో శక్తిమాన్‌గా నటించాడు. ఈ సీరియల్ 1997నుంచి 2005వరకు ప్రసారమయ్యి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘శక్తిమాన్’ సినిమాగా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్‌తో కలసి భీష్మ్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మూడు భాగాలుగా రూపొందించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. అందుకు సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. 


శక్తి మాన్ పాత్రలో నటించడానికి మేకర్స్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ను సంప్రదించారు. అందుకు రణ్‌వీర్ కూడా ఆసక్తి కనబరిచినట్టు సమాచారం. కానీ, తన అంగీకారం మాత్రం తెలపలేదు. ‘‘శక్తిమాన్ పాత్రను చేయడానికి రణ్‌వీర్ ఆసక్తి కనబరుస్తున్నాడు. సూపర్ హీరో పాత్రకు రణ్‌వీర్ అయితే సరిగ్గా సరిపోతాడని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగుతున్నాయి’’ అని మేకర్స్‌తో సన్నిహితంగా మెలిగే వ్యక్తి తెలిపారు. తాజాగా రణ్‌వీర్ సింగ్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rocky aur Rani Ki Prem Kahani) షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఆలియా భట్ (Alia Bhatt)హీరోయిన్‌గా నటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం రణ్‌వీర్ చేతిలో ‘సర్కస్’ (Cirkus), ‘సింబా-2’ (Simmba 2) వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ చిత్రాల అనంతరం శంకర్‌తో కలసి పనిచేయాలి. ఈ మూవీస్ అన్ని పూర్తయితేనే అతడి డైరీ ఖాళీ అవుతుంది. అప్పటి వరకు మేకర్స్ రణ్‌వీర్ కోసం ఎదురు చూస్తారా.. శక్తి‌మాన్ పాత్రలో అతడు నటిస్తాడా, లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ‘శక్తిమాన్’ ను రూ. 300కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తామని ముఖేశ్ ఖన్నా గతంలో తెలిపాడు. 

Updated Date - 2022-07-06T01:48:51+05:30 IST