Dhanush- Aishwarya Rajinikanth: మళ్లీ కలవబోతున్నారా..?

ABN , First Publish Date - 2022-10-05T23:09:52+05:30 IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth), హీరో ధనుష్‌ (Dhanush) తో విడాకులు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది జనవరి 17న ప్రకటించిన సంగతి తెలిసిందే.

Dhanush- Aishwarya Rajinikanth: మళ్లీ కలవబోతున్నారా..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth), హీరో ధనుష్‌ (Dhanush) తో విడాకులు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది జనవరి 17న ప్రకటించిన సంగతి తెలిసిందే. 18ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిద్దరూ సోషల్ మీడియాలో వేర్వేరుగా వెల్లడించారు. ఐశ్వర్య తండ్రి రజినీ కాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా వీరిద్దరి మధ్య రాజీ కుదుర్చాడానికి ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికి, వీరిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. కానీ, వీరిద్దరు మళ్లీ కలవబోతున్నారనే వార్త కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. 


ధనుష్, ఐశ్వర్య తొమ్మిది నెలలుగా వేర్వేరుగా నివసిస్తున్నారు. ఓ పార్టీలో ఎదురెదురు పడినప్పటికి పలకరించుకోలేదని గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ జంటకు యాత్రా (Yatra), లింగ (Linga) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకులు ప్రకటన తర్వాత వీరిద్దరు జంటగా ఎక్కడ కనిపించలేదు. కానీ, కొన్ని రోజుల క్రితం యాత్రా స్కూల్ ఈవెంట్‌లో వీరిద్దరు జోడీగా కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలవబోతున్నారని వదంతులు షికార్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. అందుకు బలం చేకూర్చేలా ఓ వార్త కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేయడం ప్రారంభమైంది. రజినీకాంత్ నివాసంలో ధనుష్, ఐశ్వర్య సమావేశం అయ్యారట. ప్రస్తుతానికి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయకూడదని నిర్ణయించుకున్నారట. విభేదాలను పరిష్కరించుకుని మళ్లీ కలసిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ వార్త విని ధనుష్ అభిమానులు ఖుషి అయిపోయారు. గతంలోనే ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఈ దంపతులు భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకుని త్వరలోనే కలిసి పోయే అవకాశం ఉందని వెల్లడించాడు. ‘‘భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సాధారణం. అటువంటి గొడవలే వీరిద్దరి మధ్య చోటు చేసుకున్నాయి. ఫోన్‌లో వారితో మాట్లాడాను. కొన్ని సలహాలు, సూచనలు అందించాను. రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని వారిద్దరిని కోరాడు. పిల్లల భవిష్యత్తు రీత్యా సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు’’ అని ధనుష్ తండ్రి కస్తూరి రాజా తెలిపాడు. 


Updated Date - 2022-10-05T23:09:52+05:30 IST