Ramayana: బిగ్ బాలీవుడ్ ప్రాజెక్టులో రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్..?

ABN , First Publish Date - 2022-07-21T23:30:42+05:30 IST

సినీ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). తాజాగా అతడు నటించిన చిత్రం ‘షంషేరా’(Shamshera). వాణీ కపూర్ హీరోయిన్‌గా నటించింది.

Ramayana: బిగ్ బాలీవుడ్ ప్రాజెక్టులో రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్..?

సినీ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). తాజాగా అతడు నటించిన చిత్రం ‘షంషేరా’(Shamshera). వాణీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. యశ్ రాజ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ జులై 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ (Ramayana) ప్రాజెక్టుకు మేకర్స్ తనతో చర్చలు జరుపుతున్నారని చెప్పాడు.   


‘దంగల్’ డైరెక్టర్ నితీశ్ తివారీ (Nitish Tiwari)డ్రీమ్ ప్రాజెక్టు ‘రామాయణ’. గత కొంత కాలంగా ఈ సినిమా బాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో రాముడిగా కనిపించనున్నాడని సమాచారం. హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఈ చిత్రంలో రావణాసురుడిగా నటించనున్నాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది రెండో అర్ధ బాగం నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ‘‘రామాయణ బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా. ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్‌లను మేకర్స్ సంప్రదించారు. ఇప్పటికే ఈ ఇద్దరు నటులు తమ అంగీకారం తెలిపారు. కానీ, కాంట్రాక్ట్‌పై మాత్రం సంతకం చేయలేదు. చివరి డ్రాఫ్ట్ కథ విన్నాక తమ సమాధానం చెబుతారు. ‘రామాయణ’ కోసం వచ్చే ఏడాది అర్ధభాగం నుంచి డేట్స్‌ను కేటాయించే అవకాశం ఉంది. విజువల్ వండర్‌గా ఈ మూవీని రూపొందించబోతున్నారు’’ అని చిత్ర బృందంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు. దీపికా పదుకొణె ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రణ్‌బీర్ కపూర్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఆలియా భట్ హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 16న విడుదల కానుంది.   

Updated Date - 2022-07-21T23:30:42+05:30 IST