Bollywood: పాక్ నటుడితో అమీషా పటేల్ ప్రేమాయణం.. స్పందించిన నటి..

ABN , First Publish Date - 2022-09-30T20:58:16+05:30 IST

తొలి సినిమాతోనే రాత్రికి, రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ అమీషా పటేల్ (Ameesha Patel). ‘కహోనా ప్యార్ హై’ తో (Kaho Naa... Pyaar Hai) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Bollywood: పాక్ నటుడితో అమీషా పటేల్ ప్రేమాయణం.. స్పందించిన నటి..

తొలి సినిమాతోనే రాత్రికి, రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ అమీషా పటేల్ (Ameesha Patel). ‘కహోనా ప్యార్ హై’ తో (Kaho Naa... Pyaar Hai) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. హ‌ృతిక్ రోషన్‌కు జోడీగా నటించింది. ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వరుసపెట్టి వచ్చాయి. తాజాగా అమీషాకు సంబంధించిన ఓ అప్‌డేట్ బాలీవుడ్ మీడియాలో తెగ షికార్లు కొడుతుంది. పాకిస్థాన్ నటుడితో అమీషా ప్రేమాయణం కొనసాగిస్తుందని వారం రోజులుగా బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై నటి స్పందించింది. 


పాకిస్థాన్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ (Imran Abbas) తో అమీషా పటేల్ డేటింగ్ చేస్తుందని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఇమ్రాన్‌తో కలసి అమీషా కొన్ని రోజుల క్రితం ఓ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ పుకార్లు షికార్లు కొట్టడం మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలపై అమీషా స్పందించింది. వాటిని చూడగానే నవ్వొచిందని తెలిపింది. ‘‘ఇమ్రాన్ అబ్బాస్ నాకు స్నేహితుడు. ఇద్దరం కలసి అమెరికాలోని ఒకే యూనివర్శిటీలో చదువుకున్నాం. పాక్‌కు చెందిన అనేక మంది స్నేహితులతో ఇప్పటికి నేను మాట్లాడుతుంటాను. నేను, అబ్బాస్ ఇద్దరం సినిమా పరిశ్రమకు చెందిన వారమే కావడంతో మాకు మంచి పరిచయముంది. నేను ఇమ్రాన్‌ను చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నాను. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఓ వీడియోను షూట్ చేశాను. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అతడితో డేటింగ్‌లో ఉన్నానంటూ చాలా మంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు’’ అని అమీషా షటేల్ చెప్పింది. ఇమ్రాన్ అబ్బాస్‌ను అమీషా బహ్రెయిన్‌లో కలుసుకుంది. ఈ సందర్భంగా వీరిద్దరూ ఓ ప్రేమ పాటకు సంబంధించిన వీడియోను షూట్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడటం మొదలయ్యాయి.



Updated Date - 2022-09-30T20:58:16+05:30 IST