‘‘ఆమె దారుణమైన వ్యక్తి... తన స్త్రీత్వాన్ని దుర్వినియోగం చేసింది’’

ABN , First Publish Date - 2022-04-25T04:07:56+05:30 IST

హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్, అతని మాజీ భార్య యాంబర్ హెర్డ్ మధ్య పరువు నష్టం కేసు రోజుకొక షాకింగ్ ట్విస్ట్‌తో ముందుకు సాగుతోంది. తాజాగా నటుడు అలెక్ బాల్డ్‌విన్ కూతురు ఐర్లాండ్ బాల్డ్‌విన్ జానీ డెప్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యాంబర్ హెర్డ్‌ను ఘాటు పదాలతో విమర్శించింది.

‘‘ఆమె దారుణమైన వ్యక్తి... తన స్త్రీత్వాన్ని దుర్వినియోగం చేసింది’’

హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్, అతని మాజీ భార్య యాంబర్ హెర్డ్ మధ్య పరువు నష్టం కేసు రోజుకొక షాకింగ్ ట్విస్ట్‌తో ముందుకు సాగుతోంది. తాజాగా నటుడు అలెక్ బాల్డ్‌విన్ కూతురు ఐర్లాండ్ బాల్డ్‌విన్ జానీ డెప్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యాంబర్ హెర్డ్‌ను ఘాటు పదాలతో విమర్శించింది. 


జానీ, యాంబర్ నడుమ అమెరికాలోని కోర్టులో ప్రస్తుతం డిఫమేషన్ కేసు నడుస్తోంది. విచారణలో భాగంగా ఓ ఆడియోని ప్లే చేశారు న్యాయమూర్తి ముందు. అందులో యాంబర్ స్పష్టంగా తాను జానీ డెప్‌పై భౌతిక దాడి చేసినట్లు ఒప్పుకుంది. కానీ, కొన్నాళ్ల క్రితం ఆమె తనపైనే జానీ దాడి చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఇదే విషయమై, వృత్తి రిత్యా మోడల్ అయిన ఐర్లాండ్ బాల్డ్‌విన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. యాంబర్ హెర్డ్ లాంటి ఆడవారు తనకు తెలుసునని కామెంట్ చేసింది. వాళ్లు మోసపూరిత వ్యక్తులని ఆమె అంటోంది. బాధితులుగా ప్రపంచం ముందు కనిపించేందుకు వారు తమ స్త్రీత్వాన్ని కూడా దుర్వినియోగం చేస్తారని విమర్శించింది. యాంబర్ హెర్డ్ ఒక ‘దారుణమైన వ్యక్తి’ అని ఐర్లాండ్ బాల్డ్‌విన్ మొహమాటం లేకుండా పేర్కొంది. అదే సమయంలో, జానీ డెప్ తాను కోల్పోయిన పేరు, ప్రఖ్యాతులు, జీవితం తిరిగి పొందాలని ఆమె ఆకాంక్షించింది! 

Updated Date - 2022-04-25T04:07:56+05:30 IST