జాతీయ పురస్కార గ్రహీత ఆర్.పార్తీబన్(R. Parthiban) దర్శకత్వం వహించిన ‘ఇరవిన్ నిళల్’ (Iravin Nizhal) చిత్రం కేన్స్ చలన చిత్రోత్సవాల్లో (Canes Film Festival)ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘అంతర్జాతీయ చిత్రోత్సవంలో ‘ఇరవిన్ నిళల్’ స్ర్కీనింగ్ కానుందనే విషయాన్ని సగర్వంగా తెలియజేస్తున్నాను. తమిళంతో కేన్స్‌కు ఎగిరిపోయేందుకు సిద్థంగా ఉన్నాను’ అని పార్తీబన్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం సింగిల్ షాట్‌లో తీయబడింది. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2020లో ప్రారంభమైన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా పూర్తయింది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ఆర్.మాధవన్ నటించిన ‘రాకెట్రీ’ చిత్రం కూడా కేన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘రాకెట్రీ’ తెరకెక్కించారు.