విజయదశమికి ‘ఐక్యూ’

ABN , First Publish Date - 2022-08-18T12:40:28+05:30 IST

సీనియర్‌ నటుడు సుమన్‌ ప్రత్యేక పాత్ర పోషించిన చిత్రం ‘ఐక్యూ’. సాయిచరణ్‌, పల్లవి జంటగా నటిస్తున్న...

విజయదశమికి ‘ఐక్యూ’

సీనియర్‌ నటుడు సుమన్‌ ప్రత్యేక పాత్ర పోషించిన చిత్రం ‘ఐక్యూ’. సాయిచరణ్‌, పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్‌ జి.ఎల్‌. బి. దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి సుమన్‌ మాట్లాడుతూ ‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నేను పోలీస్‌ కమిషనర్‌ పాత్ర పోషించాను. అనంతపురంలో షూటింగ్‌ జరిగింది’ అని తెలిపారు. ‘మా అన్న కొడుకు సాయిచరణ్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. సత్యప్రకాశ్‌ పై చిత్రీకరించే ఐటెమ్‌ సాంగ్‌తో చిత్రనిర్మాణం పూర్తవుతుంది. విజయదశమి రోజున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని నిర్మాత లక్ష్మీపతి చెప్పారు.  

Updated Date - 2022-08-18T12:40:28+05:30 IST