Dhanush చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్

ABN , First Publish Date - 2022-07-03T21:32:15+05:30 IST

రెండేళ్ళ క్రితం వచ్చిన ‘కర్ణన్’ (Karnan) మూవీ తర్వాత ధనుష్ (Dhanush) మళ్ళీ హిట్ అందుకోలేదు. ఆ సినిమా తర్వాత విడుదలైన ‘జగమే తంత్రం (Jagame Thanthram), అంత్రంగిరే (Athrangire), మారన్’ (Maran) సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి.

Dhanush చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్

రెండేళ్ళ క్రితం వచ్చిన ‘కర్ణన్’ (Karnan) మూవీ తర్వాత ధనుష్ (Dhanush) మళ్ళీ హిట్ అందుకోలేదు. ఆ తర్వాత విడుదలైన ‘జగమే తంత్రం (Jagame Thanthram), అంత్రంగిరే (Athrangire), మారన్’ (Maran) సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. ఈ క్రమంలో ధనుష్ తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఈ ఏడాది ‘ది గ్రేమేన్ (The Grey Man) హాలీవుడ్’ మూవీలోనూ, తిరుచిత్రాంబళం (Thiruchitrambalam), నానే వరువేన్ (Nane Varuven) తమిళ చిత్రాల్లోనూ, వెంకీ అట్లూరి (Venki Atluri) దర్శకత్వంలో ‘సార్’ (Sir) అనే డైరెక్ట్ తెలుగు సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదే సినిమా తమిళంలో ‘వాత్తి’ (Vathi) గా విడుదల కాబోతోంది. వీటి తర్వాత ధనుష్ ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు.


అరుణ్ మాదేశ్వరన్ (Arun Matheswaran) దీనికి దర్శకుడు. 1940లో జరిగిన కథాంశంతో పీరియాడికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ధనుష్ కెరీర్ లోనే ఇది అత్యధిక బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటోంది. అలాంటి ఈ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ ను ఖాయం చేశారు మేకర్స్. దీనికి ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller) అనే టైటిల్ ను ఖాయం చేస్తూ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ మోటార్ సైకిల్ పై అగ్రెసివ్ గా ఉన్న లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏడాది క్రితమే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై టీజీ త్యాగరాజన్ (TG Thyagarajan) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. మరి ఈ సినిమా ధనుష్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. 

Updated Date - 2022-07-03T21:32:15+05:30 IST