Kriti Sanon: డార్లింగ్.. ఇదిగో నా దుపట్టాతో తుడుచుకో!

ABN , First Publish Date - 2022-10-04T16:32:48+05:30 IST

‘బాహుబలి’ (Bahubali) సిరీస్ చిత్రాలతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas).. ఆ సినిమా తర్వాత వరసబెట్టి పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. పాన్ ఇండియానే

Kriti Sanon: డార్లింగ్.. ఇదిగో నా దుపట్టాతో తుడుచుకో!

‘బాహుబలి’ (Bahubali) సిరీస్ చిత్రాలతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas).. ఆ సినిమా తర్వాత వరసబెట్టి పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్‌ని కూడా ఆయన టార్గెట్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ భారీ సినిమాలే. ఈ భారీ సినిమాలలో ముందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). మోడ్రన్ రాముడిగా ప్రభాస్ కనిపించబోతోన్న ఈ చిత్రంలో సీత (Sita)గా ఆయన సరసన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘1 నేనొక్కడినే’ (1 Nenokkadine) చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ (Kriti Sanon) నటిస్తోంది. రామాయణ ఇతిహాస నేపథ్యంతో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని అక్టోబర్ 2న అయోధ్య (Ayodhya)లో గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. 


అయితే టీజర్ విడుదల తర్వాత స్పందన ఎలా ఉన్నా.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రభాస్, కృతిసనన్ (Prabhas and Kriti Sanon) కనిపించిన తీరు, వారిద్దరి మధ్య ఉన్న బాండింగే.. ఇప్పుడు వార్తలలో హైలెట్ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్, కృతిసనన్‌ల మధ్య డేటింగ్ నడుస్తుందంటూ ఈ మధ్య బాగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. బాలీవుడ్ మీడియా కూడా వారి బాండింగ్‌ని హైలెట్ చేస్తూ కథనాలు రాసుకొస్తుంది.


ఇప్పుడు.. ‘ఆదిపురుష్’ టీజర్ (Adipurush Teaser) లాంచ్ వేదికపై వారిద్దరూ చూసుకున్న చూపులు, కలుపుకున్న చేతులు, కళ్ళల్లో పలికిన ఊసులు.. అన్నీ కూడా అది నిజమే అనేలా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరీ ముఖ్యంగా ప్రభాస్‌కి చెమటలు పట్టి చేతితో తుడుచుకుంటుంటే.. ఇదిగో నా దుపట్టాతో తుడుచుకో.. అంటూ కృతిసనన్ అడుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అలాగే ఓ సందర్భంలో మెట్లు దిగుతూ.. కృతిసనన్ చేయిపట్టుకుని ప్రభాస్ నడిపించిన సీన్ చూస్తుంటే.. పెళ్లి సీనే తలపించింది.


ఇంకా ప్రభాస్ ‘ఆదిపురుష్’ గురించి మాట్లాడే ముందు.. కృతిసనన్ కళ్లల్లోకి చూసిన విధానం, అందుకు ఆమె ఇచ్చిన స్పందన.. అబ్బో ఇదే చెబితే తెలిసేది కాదు.. ఖచ్చితంగా చూడాల్సిందే. దీనికి నెటిజన్లు బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌‌లు మిక్స్ చేసి సోషల్ మీడియాలో ప్లే చేస్తుంటే.. ఫ్యాన్స్ ఏదేదో ఊహించేసుకుంటున్నారు. మొత్తంగా.. ప్రభాస్, కృతిసనన్‌ల మధ్య ఏదో జరుగుతుందనేదానికి ఈ వేదిక మరింత బలాన్ని సమకూర్చింది. అదేంటో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. 





Updated Date - 2022-10-04T16:32:48+05:30 IST