Indraganti Mohan Krishna: పడుకుంటేనే... అన్న నిర్మాత డైలాగ్ పై విమర్శలు

Twitter IconWatsapp IconFacebook Icon
Indraganti Mohan Krishna: పడుకుంటేనే... అన్న నిర్మాత డైలాగ్ పై విమర్శలు

ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna) తాజా సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali) గత వారం విడుదల అయి బాక్స్ ఆఫీస్ (Box Office) దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. సినిమా ప్లాప్ (Flop) అవ్వటం ఒక దెబ్బ అయితే, సినిమాలో ఇంద్రగంటి రాసిన ఒక డైలాగ్ (Dialogue) మీద చిత్ర పరిశ్రమలోని కొంత మంది నిర్మాతలు (Producers) విమర్శిస్తున్నారు (Criticising). సినిమాలో సుధీర్ బాబు (Sudheer Babu) ఒక కమర్షియల్ దర్శకుడు (Commercial director) నవీన్ అనే పాత్ర చేసాడు. ఒక సన్నివేశంలో (Particular scene) నవీన్ ఒక నిర్మాత గురించి మాట్లాడుతూ, ఆ నిర్మాత తన గర్ల్ ఫ్రెండ్ (Girlfriend) ని అతని పక్కన పడుకోబెడితేనే తనకి సినిమా ఇస్తాను అని అంటాడు. ఈ డైలాగ్ పై చాలామంది నిర్మాతలు ఇంద్రగంటి మీద చాల గుర్రుగా (Angry) వున్నారు.

Indraganti Mohan Krishna: పడుకుంటేనే... అన్న నిర్మాత డైలాగ్ పై విమర్శలు

ఆలా ఎలా రాస్తాడు ఇంద్రగంటి ఆ సినిమాలో, అది చాలా తప్పు అంటున్నారు. అంటే అయన దృష్టిలో నిర్మాతలు అందరూ ఆలా కనపడుతున్నారా, ఆలా పెట్టడం వాళ్ళ ప్రజల్లో చిత్ర పరిశ్రమ గురించి నెగటివ్ బయటకి వెళుతుంది అని అన్నాడు ఒక నిర్మాత. మల్లిడి సత్యనారాయణ రెడ్డి  (Mallidi Satyanarayana Reddy) అనే నిర్మాత ఇంద్రగంటి ఆలా డైలాగ్ పెట్టి వుండకూడదు అని అన్నారు. చిత్ర పరిశ్రమలో ఉంటూ ఆ పరిశ్రమని విమర్శించటం ఎంతవరకు సబబు అని అయన అన్నారు. ఇంకా పేరు చెప్పని చాలా మంది నిర్మాతలు, ఇంద్రగంటి ని విమర్శిస్తున్నారు. అది తప్పే కానీ, ఆ సినిమా ఎలాగు ప్లాప్  అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడటం అని కొందరు నిర్మాతలు అన్నారు. ఏమైనా సినిమా పోయిన బాధలో దర్శకుడు, లీడ్ యాక్టర్ ఉంటే, ఆ సినిమా కథమీద ఇలా పరిశ్రమ నుండే విమర్శలు రావటం ఆ బాధ ఇంకా ఎక్కువయింది.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.