Ranveer Singh: నటుడి కోసం బట్టలు సేకరించిన ఎన్‌జీవో

ABN , First Publish Date - 2022-07-27T14:42:35+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలు నెట్టింట సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం..

Ranveer Singh: నటుడి కోసం బట్టలు సేకరించిన ఎన్‌జీవో

బాలీవుడ్ యువ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) న్యూడ్ ఫొటోలు నెట్టింట సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం నటుడు తీసుకున్న ఈ పిక్స్‌ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్‌గా మారాయి. కొందరు ఈ నటుడికి సపోర్టు చేయగా.. మరికొందరు మాత్రం విమర్శించారు. దీంతో ఈ ఫొటోలు పలు వివాదాలకు కారణమయ్యాయి. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని రణ్‌వీర్‌పై పలు చోట్ల కేసులు సైతం నమోదు చేశారు. ఈ తరుణంలో ఈ రణ్‌వీర్‌కి వ్యతిరేకంగా ఓ ఎన్‌జీవో (NGO) వినూత్నంగా నిరసన తెలిపింది.


ఇండోర్‌కి చెందిన ‘నేకి కి దీవార్’ అనే ఎన్‌జీవో రణ్‌వీర్ సింగ్ కోసం క్లాత్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో డోనేషన్ బాక్స్‌పై ‘ఇండోర్ దేశంలోని మానసిక వ్యర్థాలను తొలగించాలని నిర్ణయించుకుంది’ అని రాసి ఉంది. పలువురు వచ్చి డ్రెస్సులు అందులో వేసి వెళుతున్నారు. ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. సరైన పని చేశారంటూ కొందరు.. అది రణ్‌వీర్ ఇష్టమంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.





Updated Date - 2022-07-27T14:42:35+05:30 IST