Rajinikanth to Samantha: భయంకరమైన ఆరోగ్య సమస్యలతో పోరాడిన గెలిచిన.. భారత సినీ స్టార్స్ వీళ్లే..

ABN , First Publish Date - 2022-09-04T19:10:13+05:30 IST

సినీ సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. నిరంతరం ఎదో షూటింగ్‌ చేస్తూ బిజీ గడుపుతుంటారు. అలాగే..

Rajinikanth to Samantha: భయంకరమైన ఆరోగ్య సమస్యలతో పోరాడిన గెలిచిన.. భారత సినీ స్టార్స్ వీళ్లే..

సినీ సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. నిరంతరం ఎదో షూటింగ్‌ చేస్తూ బిజీ గడుపుతుంటారు. అలాగే.. కొందరు నటులైతే వారు పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ.. ఆ నటులు తమకి ఉన్న ఆరోగ్య సమస్యలను అభిమానులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. వాటితో పోరాడుతూనే అందరి ముందు నవ్వుతూ కనిపిస్తుంటారు. అందులో కొందరూ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించిన ప్రముఖులు అలాంటి వ్యాధులతో యుద్ధం చేసి గెలిచారు. అందులో.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ నుంచి సమంత వరకూ ఇలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.


రజనీకాంత్ (Rajinikanth)

దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్. 2011లో ఈయనకి బ్రాంకైటిస్‌ సోకింది. దానికి కారణం ఆసుపత్రిలో చేరి అనేక చికిత్సల అనంతరం బయటికి రాగలిగారు.


సమంత (Samantha)

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో సమంతా రూత్ ప్రభు ఒకరు. ఈ బ్యూటీ 2012 సంవత్సరంలో పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితితో బాధపడింది. ఈ వ్యాధి ఉన్నవారికి సూర్యరశ్మి తగిలితే చాలా ఇబ్బంది పడతారు. అదే వ్యాధితో సమంత ఇబ్బంది పడి పలు చికిత్సల తర్వాత నార్మల్ అయ్యింది.


హృతిక్ రోషన్ (Hrithik Roshan)

చిన్నతనంలో హృతిక్ రోషన్ నత్తితో బాధపడేవాడు. తరువాత, అతనికి స్పైనల్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది తీవ్రమైన ఆరోగ్య స్థితి. దీనిలో వెన్నుపాము వంకరగా ఉంటుంది. సాధారణ స్థితికి రావడానికి పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.


సల్మాన్ ఖాన్ (Salman Khan)

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ట్రిజెమినల్ న్యూరల్జియాతో బాధపడుతున్నట్లు సమాచారం. దీని కారణంగా ఆ వ్యక్తి ముఖంలోని వివిధ భాగాలలో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ వ్యాధికి ఆయన ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు.


దీపికా పదుకొనే (Deepika Padukone)

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రేమ జీవితం గురించి తెలిసిందే. ఓ లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆమె డిప్రెషన్‌కి గురయ్యినట్లు కూడా పలుసార్లు బాహాటంగానే చెప్పుకొచ్చింది. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట. అందుకే అలాంటి వారికి సహాయం చేయడానికి ‘లైవ్ లవ్ లాఫ్’ అనే సంస్థను కూడా ప్రారంభించింది.

Updated Date - 2022-09-04T19:10:13+05:30 IST