Bollywood సీనియర్ జంటకి... ఎర్ర తివాచీ పరిచిన ఎడారి దేశం!

ABN , First Publish Date - 2022-05-31T23:23:06+05:30 IST

బాలీవుడ్ రచయిత, కవి జావేద్ అఖ్తర్, ఆయన భార్య షబానా అజ్మీ యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇప్పటికే ఈ గౌరవాన్ని వరుణ్ ధవన్, భాగ్యశ్రీ, పృథ్వీరాజ్, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్ వంటి వారు కూడా పొందారు. తమకు గోల్డెన్ వీసా జారీ చేసినందుకు సంబంధిత అధికారులకు జావేద్, షబానా ధన్యవాదాలు తెలిపారు...

Bollywood సీనియర్ జంటకి... ఎర్ర తివాచీ పరిచిన ఎడారి దేశం!

బాలీవుడ్ రచయిత, కవి జావేద్ అఖ్తర్, ఆయన భార్య షబానా అజ్మీ యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇప్పటికే ఈ గౌరవాన్ని వరుణ్ ధవన్, భాగ్యశ్రీ, పృథ్వీరాజ్, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్ వంటి వారు కూడా పొందారు. తమకు గోల్డెన్ వీసా జారీ చేసినందుకు సంబంధిత అధికారులకు జావేద్, షబానా ధన్యవాదాలు తెలిపారు. 


ఈ మధ్య కాలంలో వరుసగా భారతీయ నటీనటులకు, ఇతర ప్రముఖులకు గోల్డెన్ వీసాలు అందిస్తోన్న యూఏఈ ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీకి కూడా అందజేసింది. పదేళ్ల పాటూ ఆమెకు గోల్డెన్ వీసా వర్తిస్తుంది. సంజయ్ దత్, మమ్ముట్టీ లాంటి వారు ఆ మధ్య దుబాయ్ వెళ్లి తమ గోల్డెన్ వీసాల్ని అందుకున్నారు. యూఏఈ దేశం తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే క్రమంలో, విదేశీ టూరిస్టుల్ని ఆకర్షించిటంలో భాగంగా మన దక్షిణ, ఉత్తర భారత సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా ఎర్ర తివాచీ పరుస్తోంది... 


అయిదు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్ సీనియర్ లిరిసిస్ట్ అండ్ రైటర్ జావేద్ అఖ్తర్ 1999లో పద్మ శ్రీ, 2007లో పద్మ భూషణ్ పురస్కారాలు కూడా అందుకున్నారు. ‘షోలే’, ‘దీవార్’ వంటి లెజెండ్రీ మూవీస్ కి మరో రచయిత సలీమ్ ఖాన్ తో కలసి జావేద్ అఖ్తర్ పని చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన ఆయన దశాబ్దాలుగా భారతీయ సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. 


జావేద్ భార్య షబానా అజ్మీ కూడా విభిన్నమైన సినిమాలతో నాలుగు దశాబ్దాలుగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఆమె ఇప్పటి వరకూ 100 సినిమాలకు పైగా నటించారు. 

Updated Date - 2022-05-31T23:23:06+05:30 IST