IFFM: ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవం.. ‘జై భీమ్’కు నిరాశ..ఉత్తమ చిత్రంగా..

ABN , First Publish Date - 2022-08-16T01:02:02+05:30 IST

ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్అవార్డ్స్‌ (IFFM) ను తాజాగా మెల్‌బోర్న్‌లో బాహూకరించారు. ఈ పురస్కారాల్లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. షెఫాలీ షా

IFFM: ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవం.. ‘జై భీమ్’కు నిరాశ..ఉత్తమ చిత్రంగా..

ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అవార్డ్స్‌ (IFFM) ను తాజాగా మెల్‌బోర్న్‌లో బాహూకరించారు. ఈ పురస్కారాల్లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. షెఫాలీ షా (Shefali Shah) ఉత్తమ నటిగా పురస్కారాన్ని గెలుపొందింది. రణ్‌వీర్ ‘83’ సినిమాకు అవార్డును గెలుచుకుంటే, ‘షెఫాలీ’ జల్సా చిత్రానికి పురస్కారాన్ని గెలుపొందింది. ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’, సూర్య ‘జై భీమ్’ పలు విభాగాల్లో నామినేషన్స్ సాధించినప్పటికీ పురస్కారాలను గెలుపొందలేకపోయాయి.  


ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అవార్డ్స్ ఆగస్టు 12న ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20వరకు కొనసాగుతాయి. వర్చువల్‌గా కూడా ఈ ఈవెంట్ ఆగస్టు 13నుంచి ఆగస్టు 30వరకు అందుబాటులో ఉంటుంది. ఫెస్టివల్‌లో భాగంగా ఈ ఏడాది 23భాషల నుంచి 100చిత్రాలను ప్రదర్శించారు. అభిషేక్  బచ్చన్, తాప్సీ పన్ను, వాణీ కపూర్, తమన్నా భాటియా, షెఫాలీషా, అనురాగ్ కశ్యప్, కబీర్ ఖాన్, నిఖిల్ అడ్వాణీ, సూజిత్ సర్కార్ తదితరులు పతకాన్ని చేతబూని ఫిలిం ఫెస్టివల్‌ను ప్రారంభించారు.    


పలు విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకున్నావారి జాబితా: 

బెస్ట్ మూవీ: 83 

బెస్ట్ డైరెక్టర్: సూజిత్ సర్కార్ (సర్దార్ ఉద్దమ్), అపర్ణా సేన్ (ద రేపిస్ట్)

బెస్ట్ సిరీస్: ముంబై డైరీస్ 26/11

బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఏ సిరీస్: సాక్షి తన్వర్ (మాయ్)

బెస్ట్ ఇన్‌డీ ఫిలిం: జగ్గీ

బెస్ట్ ఫిలిం ఫ్రమ్ ద సబ్ కాంటినెంట్: జాయ్‌లాండ్

లైఫ్‌టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్: కపిల్ దేవ్

డిస్‌రప్టర్ ఇన్ సినిమా అవార్డ్: వాణీ కపూర్

ఇక్వాలిటీ ఇన్ సినిమా అవార్డ్: జల్సా

లీడర్ షిప్ ఇన్ సినిమా అవార్డ్: అభిషేక్ బచ్చన్

Updated Date - 2022-08-16T01:02:02+05:30 IST