Ram Charan: మెగా పవర్ స్టార్ ఇంట్లో క్రికెట్ ప్లేయర్స్.. ఈ క్రేజ్ ఏంటన్నా?

ABN , First Publish Date - 2022-09-26T16:16:24+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఇంటికి క్రికెట్ ప్లేయర్స్ కొందరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆదివారం, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో

Ram Charan: మెగా పవర్ స్టార్ ఇంట్లో క్రికెట్ ప్లేయర్స్.. ఈ క్రేజ్ ఏంటన్నా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఇంటికి క్రికెట్ ప్లేయర్స్ కొందరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆదివారం, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా (India vs Australia)ల మధ్య ఫైనల్ టీ20 (T20) మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ (India) విజయకేతనం ఎగరవేసింది. మ్యాచ్ అనంతరం భారత్ క్రికెట్ ప్లేయర్స్ (Indian Cricket Players) కొందరు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన మెగాభిమానుల (Mega Fans) ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. దీంతో వారు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్ (Man Of Masses) రామ్ చరణ్ ఇంటికి భారత క్రికెటర్స్ వచ్చారు.. ఇది రామ్ చరణ్ క్రేజ్ (Craze)’ అంటూ ఒకటే ట్వీట్స్. ఈ ట్వీట్స్‌తో రామ్ చరణ్ (Ram Charan) పేరు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది. 


ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోలకు సంబంధించి వారి అభిమానులు ఎలాంటి ఫైట్స్ చేసుకుంటున్నారో.. తెలియంది కాదు. మా హీరో గొప్ప (Great) అంటే, మా హీరో గొప్ప అని ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్లిపోయారు. ఆ హీరో, ఈ హీరో అనేం లేదు.. అందరి హీరోల అభిమానులూ ఈ ఫైట్‌లో భాగమవుతున్నారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ (NTR) అభిమానుల మధ్య ఫైట్‌కి అంతేలేకుండా పోయింది. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ మా హీరో అంటే, మా హీరో అంటూ అభిమానులు బూతులు తిట్టుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. సినిమాలోనే కాదు, బయట కూడా మేమిద్దరం అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా ఉంటామని చరణ్ (Charan), తారక్‌ (Tarak)లు చెబుతున్నా, నిరూపిస్తున్నా.. కూడా వారి అభిమానుల మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇప్పుడా యుద్ధం మరింత రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు. 


ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మ్యాచ్ అనంతరం రామ్ చరణ్‌ను కలిసేందుకు.. ఆయన ఇంటికి వెళ్లిన ప్లేయర్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav), హార్థిక్ పాండ్యా (Hardik Pandya)తో పాటు మరికొంత మంది ప్లేయర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.





Updated Date - 2022-09-26T16:16:24+05:30 IST