Vijyakanth కాలి వేళ్లను తొలగించిన వైద్యులు.. రక్తం సరఫరా కాకపోవడంతోనే..

ABN , First Publish Date - 2022-06-22T20:55:01+05:30 IST

తమిళ సీనియర్ నటుడు, దేశియ మురపొక్కు ద్రవిడ కజగం (DMDK) పార్టీ అధినేత విజయ్ కాంత్ (Vijayakanth) అనారోగ్యంతో కొద్ది రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆయన

Vijyakanth కాలి వేళ్లను తొలగించిన వైద్యులు.. రక్తం సరఫరా కాకపోవడంతోనే..

తమిళ సీనియర్ నటుడు, దేశియ మురపొక్కు ద్రవిడ కజగం (DMDK) పార్టీ అధినేత  విజయ్ కాంత్ (Vijayakanth) అనారోగ్యంతో కొద్ది రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆయన ఆరోగ్యం బాగా లేదని కొంతకాలంగా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తాజాగా ఆయనకు సంబంధించిన హెల్త్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆయన కొంత కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కుడి కాలి వేళ్లకు రక్తం సరఫరా కావడం లేదు. అందువల్ల కుడి కాలికి సంబంధించిన మూడు వేళ్లను వైద్యులు తొలగించినట్టు డీఎండీకే పార్టీ తెలిపింది.  


విజయ్ కాంత్‌ను ఆరోగ్యానికి సంబంధించి అసత్యాలను ప్రచారం చేయొద్దని డీఎండీకే ఓ ప్రకటనను వెలువరించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని అభిమానులు, పార్టీ కార్యకర్తలను కోరింది. కెప్టెన్ విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ (MK Stalin) విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘నా ప్రియ మిత్రుడు విజయ్ కాంత్ త్వరగా కోలుకుని గతంలో లాగానే కెప్టెన్‌లా గర్జించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’’ అని రజినీకాంత్ తెలిపారు.

Updated Date - 2022-06-22T20:55:01+05:30 IST