Indian 2: డబుల్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్..

ABN , First Publish Date - 2022-08-24T16:07:32+05:30 IST

ఉలగనాయగన్ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) నటిస్తున్న ఇండియన్ 2 మూవీ నుంచి రెండు సర్‌ప్రైజులొచ్చాయి. ఆయన కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఇండియ‌న్ (Indian) ఒక‌టి. ఈ మూవీ రిలీజై 21 ఏళ్లు అవుతుంది.

Indian 2: డబుల్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్..

ఉలగనాయగన్ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) నటిస్తున్న ఇండియన్ 2 మూవీ నుంచి రెండు సర్‌ప్రైజులొచ్చాయి. ఆయన కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఇండియ‌న్ (Indian) ఒక‌టి. ఈ మూవీ రిలీజై  21 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు మ‌ళ్లీ క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఇండియ‌న్ సినిమాకు సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 (Indian 2) రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో విడుదల‌ కావాల్సింది. నిర్మాత‌ల‌కు, శంక‌ర్‌ (Shankar)కు మధ్య వ‌చ్చిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌.. క‌రోనా వంటి కార‌ణాల‌తో చిత్రీకరణ దశలోనే నిలిచిపోయింది. 


దాంతో శంకర్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోగా పాన్ ఇండియా మూవీ RC 15ని సెట్స్ పైకి తీసుకొచ్చారు. అయితే, మా సినిమాను పూర్తి చేయ‌కుండా మ‌రో సినిమా ఎలా చేస్తావంటూ అప్ప‌ట్లో ఇండియ‌న్ 2 నిర్మాత‌లు శంక‌ర్‌పై కేసు వేయ‌టానికి కూడా సిద్ధ‌మ‌య్యారు. కానీ, శంక‌ర్ మ‌ళ్లీ సినిమాను చేస్తాన‌ని స‌ర్ది చెప్పి వ్య‌వ‌హారాన్ని పెద్ద‌ది కాకుండా చూశారు. మ‌రో వైపు రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తోన్న RC 15 చిత్రీక‌ర‌ణ కాస్త ఆగింది. ఇప్పుడేమో ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా చిత్రీకరణ దశలోనే నిలిచిపోయింది. 


దాంతో శంకర్  (Director Shankar) ఆగిపోయిన ఇండియ‌న్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఈ సినిమా  చిత్రీకరణ మొదలైంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్‌, ర‌కుల్ ప్రీత్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేశారు. దీనిలో భాగంగానే ఇండియ‌న్ 2కి సంబంధించిన సరికొత్త పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ ఏంటంటే లైకా ప్రొడక్షన్స్ తో పాటుగా ఈ సినిమా రిలీజ్ నిర్మాణంలో మరో ప్రముఖ సంస్థ రెడ్ జయింట్ వారు కూడా భాగం అయ్యినట్టుగా మేకర్స్ ప్రకటించారు.  కాగా, ఈ తాజా ఈ షెడ్యూల్ లో కమల్, కాజల్ (Kajal Aggarwal), రకుల్ ప్రీత్ అందరూ పాల్గొంటున్నారు.



Updated Date - 2022-08-24T16:07:32+05:30 IST