RC 15 తర్వాత 'ఇండియన్ 2'..కమల్ క్లారిటీ

ABN , First Publish Date - 2022-06-18T15:05:50+05:30 IST

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన తాజా చిత్రం 'విక్రమ్' (Vikram). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ హిట్ సాధించింది.

RC 15 తర్వాత 'ఇండియన్ 2'..కమల్ క్లారిటీ

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన తాజా చిత్రం 'విక్రమ్' (Vikram). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ హిట్ సాధించింది. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ (Lokesh Kanagraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఇందులో సూర్య, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ మూవీ కమల్ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడమే కాదు, ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన తమిళ సినిమాలలో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 


అయితే, ఈ సినిమా కంటే ముందు అగ్ర దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో 'ఇండియన్ 2' (Indian 2) మొదలుపెట్టారు. అయితే, దర్శకనిర్మాతల మధ్య నెలకొన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల షూటింగ్ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. గతకొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉన్న కారణంగా దర్శకుడు శంకర్ టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది.


అయితే, ఇటీవల వచ్చిన 'విక్రమ్' మూవీ సక్సెస్ మీట్‌లో 'ఇండియన్ 2' మూవీపై కమల్ క్లారిటీ ఇచ్చారు. దర్శకనిర్మాతల మధ్య సమస్యలు తొలగిపోయాయని, త్వరలో ఈ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కుతుందనీ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు కమల్ కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రసుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సీ 15 (RC 15) తర్వాత మా 'ఇండియన్ 2' మొదలవుతుంది అని వెల్లడించారు. దీంతో మరోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌పై కన్‌ఫర్మేషన్ వచ్చింది. కాగా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారని ప్రకటించారు. అయితే, ఇటీవల కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మరి ఇండియన్ 2లో హీరోయిన్‌గా తనే నటిస్తుందా లేక మరో హీరోయిన్ రీప్లేస్ అవుతుందా చూడాలి. 

Updated Date - 2022-06-18T15:05:50+05:30 IST