Bigg Boss 6: కాలితో తన్నారు.. డ్రెస్‌ చింపేశారు!

Twitter IconWatsapp IconFacebook Icon
Bigg Boss 6: కాలితో తన్నారు.. డ్రెస్‌ చింపేశారు!

బిగ్‌బాస్‌ (Bigg boss 6)ఇంట్లో మూడోవారం కెప్టెన్సీ టాస్క్‌ హోరాహోరిగా సాగుతోంది. ‘అడవిలో ఆట’ (Adavilo aata task) టాస్క్‌లో పోలీసులు, దొంగలు, అత్యాశ గల వ్యాపారి మూడు విభాగాలుగా ఆట ఆడుతున్నారు. అయితే ఈ ఆటలో అత్యాశ గల వ్యాపారిగా గలాటా గీతూ (Geethu royal) నిబంధనలు అతిక్రమించి ఆడుతోంది. పోలీసులే తమ బాధ్యతలు మరచి కాపాడాల్సిన వస్తువులను దొంగతనం చేస్తూ కనిపించారు. ఇక గీతూలాంటి అత్యాశ గల వ్యాపారి ఊరుకొంటుందా? కొన్ని వస్తువులను తాను కూడా తెచ్చి దాచిపెట్టుకుంది. దీంతో ఆగ్రహించిన బిగ్‌ బాస్‌ టాస్క్‌ రూల్స్‌ గురించి మరోసారి వివరించాడు. రక్షకభటులు రైడ్‌లో ఉన్నప్పుడు దొంగలు వారిని పట్టుకోవచ్చు.. రైడ్‌ టైం పూర్తయిన తర్వాత పోలీసులు ఇంట్లోనే ఉంటే వారిని కిడ్నాప్‌ చేసే అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రకారం పోలీస్‌ కేటగిరీలో ఉన్న ఇనాయను దొంగలు పట్టేసుకున్నారు. పోలీసులు స్టోర్‌ రూంను రైడ్‌ చేస్తామని చెప్పలేదు. అయినా కూడా ఇనయ (Inaya fight) లోపలకు వెళ్లింది. దాంతో దొంగలు ఆమెను పట్టుకున్నారు. అయితే పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఆమెను ఇద్దరి కంటే ఎక్కువమందే పట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో కొట్టిందో.. లేక కావాలనే చేసిందో తెలియదు కానీ ఆరోహిని కాలితో తన్నేసింది. నేహాను ఇనాయ చెంప మీద కొట్టింది. నేహా బాధపడుతూ అంతలా కొట్టాలా? అంటూ చర్చ మొదలుపెట్టింది. ఇనయా కూడా ఏమీ తగ్గలేదు. తన డ్రెస్‌ ఎవరో పైకి లాగారంటూ, తీసేశారంటూ చెప్పుకొచ్చింది. మధ్య అందుకున్న గీతూ ఇవన్నీ తప్పు మాటలు. అలా ఏ ం జరగలేదు. ‘మాటలు మారుస్తున్నావ్‌.. అబద్ధాలు చెబుతున్నావ్‌.. అంటూ మండిపడింది గీతూ. ఇద్దరి మధ్య పెద్ద రణరంగమే జరిగింది. గీతూ పక్కకు వెళ్లి పోయి తన ఆట ఆడే ప్రయత్నం చేసింది. తన బొమ్మలను కాపాడుకునేందుకు సూర్య, శ్రీహాన్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది.



రేవంత్‌ తన బొమ్మలను ఎవరో దొంగిలించారంటూ విజృంభించి మాట్లాడాడు. తన బొమ్మలను దొంగిలించిన వారికి సిగ్గూ శరం ఏమీ లేవంటూ మండిపోయాడు. అయితే రేవంత్‌ బొమ్మలు కొట్టేయడానికి నేహా, ఆరోహి పథకం వేశారు. రేవంత్‌ను కంటెండర్‌గా చూడకూడదని ప్రణాళికి వేసి మరీ కొట్టేశారు. దీంతో రేవంత్‌ దొంగల టీం మీద దండెత్తాడు. పోలీసులను గెలిపిస్తాను అంటూ ఆట ఆడాడు. 17వ రోజు ఆట ముగిసే సరికి శ్రీహాన్‌, సూర్య దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నట్లు తెలుస్తోంది. గీతూ మాత్రం కంటెండర్‌ అవ్వాలని ఫిక్స్‌ అయిపోయింది. అందులో భాగంగా కావలసినంత డబ్బు, బొమ్మలు తన దగ్గర పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. గీతూ మాత్రం వ్యాపారిగా దొంగలికే సపోర్ట్‌ చేస్తానంటూ.. తనకు ఇచ్చిన టాస్క్‌ స్ట్రాటజీతో ఆడతానని, ఏమైనా, ఎవడొచ్చినా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది. బొమ్మలే అమ్మే క్రమంలో కూడా తనకు నచ్చిన ధరే చెబుతోంది కానీ ఒక్క రూపాయి కూడా తగ్గనని చెబుతోంది. తనకు ఫేవర్‌గా ఉన్న శ్రీహాన్‌కు బొమ్మలను అమ్మింది. గంట కొట్టి టాస్క్‌ ముగించారు. విలువైన వస్తువులు ఎవరి దగ్గరున్నా వాటిని భద్రపరుచుకోవలసిన బాధ్యత వారిదే అని బిగ్‌బాస్‌ చెప్పాడు. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.