ఇందిరా గాంధీ‌గా Fatima Sana Shaikh.. మానెక్ షాగా విక్కీ కౌశల్..

ABN , First Publish Date - 2021-12-13T21:36:03+05:30 IST

దంగల్ సినిమాలో నటించి బీ టౌన్ చూపు తమ వైపు తిప్పుకున్న తారలు ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా

ఇందిరా గాంధీ‌గా Fatima Sana Shaikh.. మానెక్ షాగా విక్కీ కౌశల్..

దంగల్ సినిమాలో నటించి బీ టౌన్ చూపు తమ వైపు తిప్పుకున్న తారలు ఫాతిమా సనా షేక్,  సాన్యా మల్హోత్రా.  త్వరలో వీరిద్దరూ కలిసి మరో చిత్రంలో నటించబోతున్నారు. ఆ సినిమా పేరు సామ్ బహదూర్. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్నారు. రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్స్ నిర్మించబోతుంది. భారత సైన్యానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేసిన మానెక్ షా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించనున్నారు. 1971లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధం జరిగిన సమయంలో మానెక్‌షా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేశారు. ఈ ఏడాదికి భారత్-పాక్‌ల మధ్య యుద్ధం జరిగి 50ఏళ్లు పూర్తి అవుతోంది.   


మానెక్ షా భారత సైన్యంలో 4దశాబ్దాలపాటు, 5 యుద్ధాల్లో సేవలు అందించారు. ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ స్థాయికి చేరుకున్న మొదటి భారతీయ అధికారి ఆయనే. మానెక్ షా పాత్రను విక్కీ కౌశల్ పోషించబోతున్నారు. మానెక్ షా భార్య పాత్రలో సాన్యా మల్హోత్రా నటించబోతుంది. ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా సనా షేక్ కనిపించనుంది. 


‘‘ 1971 యుద్ధంలో ఇండియా విజయం సాధించి ఈ ఏడాదికి 50 ఏళ్లవుతోంది. అందుకు నాకు గర్వకారణంగా ఉంది. సామ్ బహదూర్ చిత్ర బృందంలో ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా చేరినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ’’ అని మేఘనా గుల్జార్ వివరించింది.


‘‘ సామ్ బహదూర్ స్టోరీలోని పాత్రలకు సాన్యా, ఫాతిమా సరిగ్గా సరిపోతారు. మొదటి సారి వారితో కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సామ్ బహదూర్ చిత్ర బృందంలోకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను ’’ అని విక్కీ కౌశల్ చెప్పాడు.

Updated Date - 2021-12-13T21:36:03+05:30 IST