God father: నిశ్శబ్ద.. విస్ఫోటనమే!

Twitter IconWatsapp IconFacebook Icon
God father: నిశ్శబ్ద.. విస్ఫోటనమే!

‘‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ... రాజకీయం (Chiranjeevi politics) నా నుంచి దూరం కాలేదు’’ చిరంజీవి (Chiranjeevi)చెప్పిన ఈ డైలాగ్‌ మూడు రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. అటు సినిమా పరిశ్రమలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అలజడి రేపింది. అయితే ఇది చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్‌(GOD father )’ చిత్రంలో డైలాగ్‌ అని తెలిసినా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ డైలాగ్‌తోపాటు ఇటీవల విడుదలైన ‘థార్‌ మార్‌’ పాటకు వినూత్నమైన స్పందన వస్తోంది. అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ షురూ చేశారు మెగాస్టార్‌. ఇందులో భాగంగా ఆయన్ను ఫ్లైట్‌లో ఇంటర్వ్యూ చేసింది యాంకర్‌ శ్రీముఖి. ముందుగా చిరంజీవి ఐ లవ్‌ యు చెప్పిన శ్రీముఖి.. ‘ఈ లుక్‌లో చాలా హాట్‌గా ఉన్నాయని, చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం’ అని చెప్పుకొచ్చింది. దానికి సిగ్గు పడ్డ చిరంజీవి.. తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. తాజాగా విడుదల చేసిన డైలాగ్‌ అమేజింగ్‌గా ఉందని శ్రీముఖి కితాబిచ్చింది. ‘ఇన్‌ ది క్లౌడ్‌ విత్‌ మెగాస్టార్‌’ అంటూ బృందం శుక్రవారం ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. 


‘‘సినిమాలో హీరోయిన్‌ లేదనీ, పాటలు లేవనే ఆలోచన రానివ్వకుండా చేసే కథ ఇది’’ అని చిరంజీవి చెప్పారు. సల్మాన్‌ఖాన్‌ కేవలం ప్రేమతో ఈ చిత్రంలో భాయ్‌గా నటించాడని అన్నారు. హ్యాట్సాఫ్‌ టు సల్మాన్‌ భాయ్‌ అని ప్రశంసించారు. జర్నలిస్ట్‌గా పూరి జగన్నాథ్‌ని చేయమంటే ‘సార్‌ నేను చచ్చినా చేయను ఆ పాత్ర’ అని అన్నాడు. సినిమాలో ఆ పాత్ర చూశాక పూరీలో కమాండింగ్‌ ఉన్న నటుడని ఆశ్చర్యపోతారు. ఈ సినిమాకు ఆరోప్రాణమై హద్దులు దాటి 100 శాతం ముందుకు తీసుకెళ్లిన వ్యక్త ఎస్‌.ఎస్‌.తమన్‌’’ అని చిరంజీవి తెలిపారు. మలయాళ హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్‌ రాజా దర్శకత్వం వహించారు. సల్మాన్‌ఖాన్‌, నయనతారా, సత్యదేవ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రధారులు. శుక్రవారం సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ పొందింది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. తెలుగు, హిందీ భాషల్లో దసరా కానుకగా వచ్చే నెల 5న చిత్రం విడుదల కానుంది. 




AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.