బర్త్‌డే పార్టీలో.. కిరాక్‌ గీతం

ABN , First Publish Date - 2022-07-05T05:46:59+05:30 IST

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. అగస్త్య, సత్య, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రధారులు...

బర్త్‌డే పార్టీలో.. కిరాక్‌ గీతం

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. అగస్త్య, సత్య, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రధారులు. రితేష్‌ రానా దర్శకత్వం వహించారు. చిరంజీవి (చెర్రి), హేమలత నిర్మాతలు. ఈనెల 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సోమవారం ‘ఓన్లీ లీగల్‌ పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పేరుతో ఓ పాటని విడుదల చేశారు. జోరుగా హుషారుగా సాగిపోయే ఈ గీతంలో లావణ్య స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ‘‘గన్స్‌ని లీగల్‌ చేసి, సెల్‌ ఫోన్‌ వాడినట్టు వాడేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్టుతో రూపొందించిన చిత్రమిది. ఓ అందమైన ఊహా ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. సినిమాలో హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. కథే హీరో. కామెడీ చిత్రాల్లో ఇదో సరికొత్త ప్రయోగం’’ అని చిత్రబృందం తెలిపింది. సంగీతం: కాలభైరవ.


Updated Date - 2022-07-05T05:46:59+05:30 IST