త్వరలో పునీత్ రాజ్ కుమార్ బయోపిక్..?

ABN , First Publish Date - 2021-11-22T23:58:26+05:30 IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న మరణించారు. జిమ్ చేస్తుండగా కార్డియాక్ అరెస్టుకు

త్వరలో పునీత్ రాజ్ కుమార్ బయోపిక్..?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న మరణించారు. జిమ్ చేస్తుండగా కార్డియాక్ అరెస్టుకు గురయి ఆయన మృతి చెందారు. పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను త్వరలో సినిమాగా తెరకెక్కించనున్నట్టు కన్నడ మీడియాలో వదంతులు వినిసిస్తున్నాయి. పునీత్‌ అభిమాని ఒకరు ట్విట్టర్‌లో పునీత్‌ బయోపిక్‌ చేయాలంటూ దర్శకుడు సంతోష్‌ ఆనందారంను కోరారు. ఆ స్టార్ హీరో బయోపిక్‌ను తీయడానికి తన శక్తి మేర ప్రయత్నిస్తానని సంతోష్ రిప్లై ఇచ్చారు. 


‘‘ ప్లీజ్ అప్పు సర్ బయోపిక్‌ను తీయండి. మీరు అప్పును చాలా దగ్గరి నుంచి చూశారు. ఆయన ప్రేమించే విధానం, పాటించే నైతిక విలువల గురించి మీకు బాగా తెలుసు. దయ చేసి పునీత్‌పై బయోపిక్‌ను తీయండి’’ అని ట్విట్టర్‌లో సంతోష్ ఆనందారంను కోరారు. అందుకు సంతోష్  ఆనందారం స్పందించారు. ‘‘ అప్పు సర్ ఎప్పుడు మన గుండెల్లో నిలిచే ఉంటారు. అతడి బయోపిక్‌ను తీసేందుకు నా శక్తి మేర ప్రయత్నిస్తా ’’ అని రిప్లై ఇచ్చారు.   


పునీత్ రాజ్ కుమార్, సంతోష్ ఆనందారం కలిసి గతంలో రెండు బ్లాక్ బ్లాస్టర్ సినిమాలను అభిమానులకు అందించారు. మొదటిసారిగా వీరిద్దరూ 2017లో రాజకుమార అనే సినిమాకు కలిసి పనిచేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు  కొట్టింది. అనంతరం 2021లో వీరిద్దరూ కలిసి పనిచేసిన  యువరత్న సినిమా కన్నడ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మూడో సారి కూడా వీరిద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ పునీత్ ఈలోపునే మరణించారు.



Updated Date - 2021-11-22T23:58:26+05:30 IST