God Father: మెగా సీన్‌ లీక్‌!

ABN , First Publish Date - 2022-07-24T22:23:16+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘గాడ్‌ ఫాదర్‌’ ‘భోళా శంకర్‌, మెగా 154 (వాల్తేరు వీరయ్య–వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాలు సెట్స్‌ మీద ఉన్నాయి. ఇటీవల ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలోని లుక్‌, గ్లింప్స్‌ వీడియో విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

God Father: మెగా సీన్‌ లీక్‌!

మెగాస్టార్‌ చిరంజీవి (Mega star chiranjeevi)వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘గాడ్‌ ఫాదర్‌’(God father) ‘భోళా శంకర్‌, మెగా 154 (వాల్తేరు వీరయ్య–వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాలు సెట్స్‌ మీద ఉన్నాయి. ఇటీవల ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలోని లుక్‌, గ్లింప్స్‌ వీడియో విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లపై (Salman khan)తెరకెక్కిస్తున్న సీన్‌ ఒకటి లీక్‌ అయింది. దీనిలో చిరంజీవి పక్కన సల్మాన్‌ గన్‌ పట్టుకుని ఉన్నారు. ఇంటెన్స్‌గా ఉన్న ఈ లుక్‌ చూస్తుంటే క్లైమాక్స్‌ సంబంధించిన సన్నివేశంలాగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.


మోహన్‌ రాజా (Mohanraja)దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార (Nayanatara) చిరంజీవికి చెల్లెలిగా నటిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌, పూరి జగన్నాథ్‌, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. లక్ష్మీభూపాల్‌ మాటలు అందిస్తున్నారు. తమన్‌ స్వరకర్త. ఆర్‌.బిచౌదరి, ఎన్‌.వి.ప్రసాద్‌, రామ్‌చరణ్‌ నిర్మాతలు. (God father scene leak)




Updated Date - 2022-07-24T22:23:16+05:30 IST