Ileana : డిజిటల్ ఎంట్రీకి రెడీ !

ABN , First Publish Date - 2022-09-09T21:45:14+05:30 IST

‘దేవదాస్’ (Deavadas) చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా (Ileana). ఇదే సినిమాతో రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా ఎంటర్ అయ్యాడు. తొలి చిత్రం ఈ ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

Ileana : డిజిటల్ ఎంట్రీకి రెడీ !

‘దేవదాస్’  (Deavadas) చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా (Ileana). ఇదే సినిమాతో రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా ఎంటర్ అయ్యాడు. తొలి చిత్రం ఈ ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మహేశ్ బాబు (Mahesh babu) ‘పోకిరి’ (Pokiri) చిత్రంతో ఇలియానా క్రేజీ హీరోయిన్ అయిపోయింది. దక్షిణాదిలో చాన్నాళ్ళపాటు .. అగ్రకథానాయికగా వెలుగొందిన ఈ గోవా సుందరి.. ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రాకతో రేస్‌లో వెనుకబడింది. ఆ దశలో బాలీవుడ్ లో కాలు పెట్టినా అంతగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఇలియానా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఫేడవుట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇలియానా ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం.


ఇప్పటికే చాలా మంది కథానాయికలు వరుస సినిమాలు చేస్తూనే,  మరో వైపు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు.ఇప్పుడు ఇలియానా కూడా ఈ జాబితాలోకి చేరింది. మహిళా ప్రాధాన్యం కలిగిన ఓ వెబ్ సిరీస్ లో ఇలియానా నటించబోతోంది. ‘ది ఫేమ్ గేమ్’ (The Fame Game) ఫేమ్ .. కరిష్మా కోహ్లి (Karishma Kohli) దీనికి దర్శకుడు. అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్, బిబిసి స్టూడియోస్ సంయుక్తంగా ఈ సిరిస్ ను నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో ఈ సిరీస్ రూపొందబోతోంది. టైటిల్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఇలియానా నటించిన ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా ఆమె చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. 

Updated Date - 2022-09-09T21:45:14+05:30 IST