కోలీవుడ్‌లో పూజా హెగ్డే కోలాహలం... ఇళయదళపతితో కలసి 100 మిలియన్లు!

ABN , First Publish Date - 2022-02-28T01:34:46+05:30 IST

ఇళయదలపతి విజయ్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘బీస్ట్’.

కోలీవుడ్‌లో పూజా హెగ్డే కోలాహలం... ఇళయదళపతితో కలసి 100 మిలియన్లు!

ఇళయదలపతి విజయ్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ‘బీస్ట్’ మూవీ నుంచి ఈ మధ్యే మొదటి సాంగ్‌గా ‘అరబిక్ కుత్తు’ విడుదలయింది. ఈ పాటను సింగర్ జోనితా గాంధీ ఆలపించింది. ‘అరబిక్ కుత్తు’ సాంగ్‌కు సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. రీల్స్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ మధ్యే సమంత ఎయిర్ పోర్టులో ఈ పాటకు డ్యాన్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లోని అభిమానులతో పంచుకుంది. 


‘బీస్ట్’ మూవీ నుంచి ‘అరబిక్ కుత్తు’ పాట విడుదలైన నాటి నుంచే పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ పాట విడుదలైన రెండు వారాలకే దాదాపుగా 100మిలియన్ల వ్యూస్ సాధించింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పెట్టింది. ‘అరబిక్ కుత్తు’ విడుదలైన 24గంటల్లోనే 25మిలియన్ వ్యూస్ సాధించి, 2.2 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. 4రోజుల్లో 50మిలియన్ వ్యూస్ సాధించిందని సంస్థ తెలిపింది. తాజాగా ఈ పాట 100మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. 3.8మిలియన్ల మంది ఈ సాంగ్‌ను లైక్ చేశారు. నెట్టింట్లో ఎక్కడ చూసినా ‘హలమితీ హబీబో’ అంటూ ఈ పాట రీల్సే కనిపిస్తున్నాయి.



Updated Date - 2022-02-28T01:34:46+05:30 IST