Ikshu: విడుదలకు సిద్ధం..

ABN , First Publish Date - 2022-08-06T19:41:34+05:30 IST

వాస్తవిక కథాంశంతో ‘ఇక్షు’ (Ikshu) అనే పేరుతో పాన్‌ ఇండియా మూవీ రూపొందింది. పద్మజా ఫిలిమ్‌ ఫ్యాక్టరీ బ్యానరులో డాక్టర్‌ హనుమంతరావు నిర్మాణ సారథ్యంలో తమిళ, తెలుగు, కన్నడం, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించారు.

Ikshu: విడుదలకు సిద్ధం..

వాస్తవిక కథాంశంతో ‘ఇక్షు’ (Ikshu) అనే పేరుతో పాన్‌ ఇండియా మూవీ రూపొందింది. పద్మజా ఫిలిమ్‌ ఫ్యాక్టరీ బ్యానరులో డాక్టర్‌ హనుమంతరావు నిర్మాణ సారథ్యంలో తమిళ, తెలుగు, కన్నడం, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. వి.వి.రుషిక (VV Rushika) ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే, షూటింగ్‌తో పాటు అన్ని పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో రామ్‌ అగ్నివేష్‌ (Ram Agnivesh) హీరోగా పరిచయమవుతున్నారు. అలాగే, రాజీవ్‌ కనకాల, ‘బాహుబలి’ ప్రభాకర్‌, ‘చిత్రం’ శీను తదితరులు నటించారు. 


తెలుగు, మలయాళ భాషల్లో ప్రముఖ ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రం పంపిణీ హక్కులను కొనుగోలు చేసి విడుదల చేయనుంది. 5 భాషల్లో ప్రీమియర్‌ షోలు వేయగా వాణిజ్య పరంగా మంచి స్పందన వచ్చింది. ఇతర బిజినెస్‌ లావాదేవీల వ్యవహారాలను పద్మజా ఫిల్మ్‌ ఫ్యాక్టరీ తరపున సమర్పకుడు సాయి కార్తీక్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు మొదటి వారంలో దేశ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ త్వరలోనే వెల్లడించనున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం నవీన్‌ తొడిగి, సంగీతం వికాస్‌ బాడిస అందించారు. 

Updated Date - 2022-08-06T19:41:34+05:30 IST