IIFA Awards 2022 ఫంక్షన్ వాయిదా..కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-05-15T21:35:27+05:30 IST

సినిమా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారాలు ‘ద ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ’ (ఐఫా)(IIFA) అవార్డ్స్. ఈ సారి ఐఫా 22వ ఎడిషన్ పురస్కారాల ప్రధానోత్సవం అబుదాబీలో మే

IIFA Awards 2022 ఫంక్షన్ వాయిదా..కారణమేంటంటే..

సినిమా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారాలు ‘ద ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ’ (ఐఫా)(IIFA) అవార్డ్స్. ఈ సారి ఐఫా 22వ ఎడిషన్ పురస్కారాల ప్రధానోత్సవం అబుదాబీలో మే 20, 21న జరగాలి. కానీ, యుఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ (Sheikh Khalifa bin Zayed Al Nahyan) మరణించడంతో ఈ వేడుక వాయిదా పడింది. ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ యుఏఈ ప్రభుత్వం 40రోజులను సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ క్రమంలో ఐఫా అవార్డ్స్ ఫంక్షన్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.  


ఐఫా అవార్డ్స్ ఫంక్షన్‌ను జులై 14, 15, 16 తేదీల్లో అబుదాబీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యుఏఈ ప్రెసిడెంట్ మృతికి విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఐఫా ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. ‘‘యుఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. భగవంతుడు ఆయనపై దయను ఉంచి శాంతిని అందించాలని కోరకుంటున్నాం’’ అని ఐఫా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఐఫా 22వ ఎడిషన్‌కు సల్మాన్ ఖాన్ (Salman Khan), రితేశ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh) హోస్ట్‌లు‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుకలో వరుణ్ ధావన్, అనన్య పాండే తదితరులు డ్యాన్స్ చేయనున్నారు.



Updated Date - 2022-05-15T21:35:27+05:30 IST