ముంబైలోని ఆ స్టేడియం పేరు వాడితే జైలు కెళ్లడం ఖాయం..బెయిల్ వచ్చేలోపు గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయవచ్చంటున్న బాలీవుడ్ నటి

ABN , First Publish Date - 2021-10-31T22:43:47+05:30 IST

అలనాటి బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా దేశవ్యాప్తంగా చర్చకెక్కిన అంశాలపై స్పందించింది. వివాదస్పదమయిన కర్వా చౌత్ యాడ్, ఆర్యన్ ఖాన్

ముంబైలోని ఆ స్టేడియం పేరు వాడితే జైలు కెళ్లడం ఖాయం..బెయిల్ వచ్చేలోపు గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయవచ్చంటున్న బాలీవుడ్ నటి

అలనాటి బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా దేశవ్యాప్తంగా చర్చకెక్కిన అంశాలపై స్పందించింది. వివాదస్పదమయిన కర్వా చౌత్ యాడ్, ఆర్యన్ ఖాన్ బెయిల్ వంటి అంశాలపై ఆమె తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. ఆమె ఒక పత్రికకు కాలమ్ రాసింది. ‘‘ కొడుకుల వల్ల వార్తల్లోకెక్కిన ప్రసిద్ధ తండ్రులు ’’ అనే హెడ్డింగ్ పెట్టి ఆమె కాలమ్ రాసింది. కానీ, ఆమె ఆ కాలమ్‌లో షారూఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ పేర్లను ఎక్కడ ప్రస్తావించలేదు. 


‘‘ బ్లాస్ట్, హై, డైట్ కోక్, వాంఖడే స్టేడియం వంటి పదాలను వాడటం మానేయండి.  ఆ పదాలను ఏవిధంగా అర్థం చేసుకుంటారో మనకు తెలియదు. పోలీసులు మీ ఫోన్‌లను సీజ్ చేసి వాట్సప్ చాట్‌లను చెక్ చేయవచ్చు. మీరు జైలుకెళ్లడం ఖాయం. ఒక వేళ మీరు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే అది వచ్చే లోపు హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయవచ్చు ’’ అని ట్వింకిల్ ఖన్నా రాసింది. వాంఖడే స్టేడియం ముంబైలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అధికారి పేరు సమీర్ వాంఖడే కావడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.


గతంలో రాసిన కాలమ్‌లో‌ను ఆర్యన్ ఖాన్ అరెస్టుపై ఆమె స్పందించింది. ‘‘ ఆర్యన్ స్నేహితుడి వద్ద 6గ్రాముల చరస్ లభించింది. కానీ, ఆర్యన్ వద్ద డ్రగ్స్ లభించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ ఆ యువకుడిని గత రెండు వారాలుగా అర్థర్ రోడ్డు జైలులో ఉంచారు ’’ అని ఆమె చెప్పింది. ఆర్యన్‌కు తాజాగా ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 30న జైలు నుంచి విడుదలయ్యాడు.

Updated Date - 2021-10-31T22:43:47+05:30 IST