Nayanathara :అలా అయితేనే కొత్త ప్రాజెక్ట్స్‌కు సైన్?

ABN , First Publish Date - 2022-06-15T15:13:46+05:30 IST

పెళ్లి తర్వాత నయనతార (Nayanathara) కొత్తగా ఒకే చేసే ప్రాజెక్ట్స్‌కు కొన్ని కండీషన్స్ పెడుతునట్టుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ (Vignesh Sivan)ను

Nayanathara :అలా అయితేనే కొత్త ప్రాజెక్ట్స్‌కు సైన్?

పెళ్లి తర్వాత నయనతార (Nayanatara) కొత్తగా ఒకే చేసే ప్రాజెక్ట్స్‌కు కొన్ని కండీషన్స్ పెడుతునట్టుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ (Vignesh Shivan)ను ఈ నెల 9న వివాహం చేసుకున్న నయనతార.. వివాహం తర్వాత సినిమాల్లో నటించేందుకు కొన్ని షరతులు పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేరళలో ఉన్న ఈ దంపతులు చెన్నై తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తమ పనుల్లో బిజీ కానున్నారు. నయనతార మాత్రం తనను సంప్రదించే దర్శకులకు కొన్ని నిబంధనలు విధించి వాటికి అంగీకరిస్తేనే కొత్త ప్రాజెక్టులకు కమిట్‌ అవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు తెలుస్తోంది. 


ముఖ్యంగా, హీరోతో రొమాన్స్‌.. పడక గది సన్నివేశాలు, సన్నిహితంగా ఉండే సన్నివేశాలు, డ్యూయట్ సాంగ్స్‌లో దూరంగా ఉండటం.. ఇలా మరికొన్ని షరతులను పెట్టనున్నట్టుగా ఇప్పుడు సోష మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై నయన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక నయన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే..మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi) నటిస్తున్న 'గాడ్ ఫాదర్' (God Father) మూవీలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే తన పార్ట్ చిత్రీకరణ కూడా పూర్తైంది. మోహన్ రాజా ( Mohan Raja)దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ 'లూసీఫర్‌'కు అధికారిక రీమేక్. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్నారు.


అలాగే, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'జవాన్' సినిమాలో నయన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక నయనతార మొదటి హిందీ చిత్రం కావడం విశేషం. ఇవి కాక నయన్ చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నట్టు సమాచారం. 

Updated Date - 2022-06-15T15:13:46+05:30 IST