Anupama Parameswaran : ఆ ఒక్క హిట్టు పడితే..ఇక ఆపడం కష్టమే..!

ABN , First Publish Date - 2022-09-07T15:32:17+05:30 IST

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కి ఇంకో గట్టి హిట్టు పడితే ఊపు మరోలా ఉంటుందని నెటిజన్స్, ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మలయాళ హిట్ ప్రేమమ్‌ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ.

Anupama Parameswaran : ఆ ఒక్క హిట్టు పడితే..ఇక ఆపడం కష్టమే..!

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కి ఇంకో గట్టి హిట్టు పడితే ఊపు మరోలా ఉంటుందని నెటిజన్స్, ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మలయాళ హిట్ ప్రేమమ్‌ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ..తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో నితిన్ (Nithin), సమంత (Samantha) జంటగా వచ్చిన అ.ఆ మూవీ ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమాలో తన పాత్ర బాగా ఆకట్టుకోవడంతో తెలుగులో చక్కటి పాత్రలు పోషించే అవకాశాలు అందుకుంది. వీటిలో తనకు మంచి హిట్ ఇచ్చిన సినిమా శతమానం భవతి. 


కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అనుపమకి మంచి క్రేజ్ తెచ్చింది. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాలేవీ అంత కమర్షియల్ సక్సెస్‌గా నిలవలేదు. దాంతో మధ్యలో బాగానే గ్యాప్ వచ్చింది. ఒకదశలో అనుపమ కెరీర్ క్లోజ్ అని కూడా అనుకున్నారు. కార్తికేయ 2 (Karthikeya 2), 18 పేజెస్ (18 Pages) చిత్రాలు ఒకేసారి సెట్స్‌పైకి వచ్చి కరోనా కారణంగా చిత్రీకరణ దశలోనే ఆగిపోయాయి. అసలు ఈ సినిమాలు విడుదలవుతాయా..? అని అనుకున్నారు. 


అలాంటిది ఇటీవల కార్తికేయ 2 వచ్చి ఊహించని విధంగా భారీ హిట్ సాధించింది. నిఖిల్, అనుపమ, దర్శకుడు చందుమొండేటి కెరీర్‌లో మొదటి వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలవడం గొప్ప విషయం. ఇక చాలా గ్యాప్ తర్వాత రౌడీ బాయ్స్, కార్తికేయ 2 చిత్రాలతో అనుపమకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కాయి. నిఖిల్‌తోనే నటిస్తున్న మరో సినిమా 18 పేజెస్ కూడా హిట్ సాధిస్తే ఇక ఈ బ్యూటీకి పాన్ ఇండియా చిత్రాలలో అవకాశాలు దక్కడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటికే, కొన్ని కథలను విన్నదని సమాచారం. మొత్తానికి కెరీర్ క్లోజ్ అనుకున్న అనుపమ..ఇలా ఫాంలోకి రావడం మాత్రం ఆసక్తికరమే.  

Updated Date - 2022-09-07T15:32:17+05:30 IST