అల్లు అర్జున్ ప్రశంసలకు .. ‘కెజియఫ్’ హీరో యశ్ ఏమని రిప్లై ఇచ్చాడంటే..?

ABN , First Publish Date - 2022-04-23T02:43:27+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘‘కెజియఫ్: చాప్టర్-2’’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్: చాప్టర్-1’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీని పాన్ ఇండియాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.

అల్లు అర్జున్ ప్రశంసలకు .. ‘కెజియఫ్’ హీరో యశ్ ఏమని రిప్లై ఇచ్చాడంటే..?

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘‘కెజియఫ్: చాప్టర్-2’’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్: చాప్టర్-1’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీని పాన్ ఇండియాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రాన్ని తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించాడు. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. 


పుష్పరాజ్ చిత్ర బృందాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘.. ‘కెజియఫ్’ చిత్రబృందానికి అభినందనలు. యశ్, సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీ నిధి శెట్టిలు తమ నటనతో ఆకట్టుకున్నారు. రవిబస్రూర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. భువనగౌడ విజువల్స్‌తో మాయ చేశాడు. ఇతర టెక్నిషన్లు కూడా బాగా పనిచేశారు. తన విజన్‌ను ఎంతగానో నమ్మి ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. భారతీయ సినిమా స్థాయిని పెంచుతున్నందుకు, మంచి సినిమా అనుభూతిని అందించినందుకు థ్యాంక్ యూ’’ అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. బన్నీ ట్వీట్‌కు ‘కెజియఫ్’ హీరో, హీరోయిన్లు యశ్, శ్రీనిధి శెట్టి స్పందించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, బాలీవుడ్ నటి రవీనా టండన్ కూడా రిప్లై ఇచ్చారు. ‘‘థ్యాంక్ యూ అల్లు అర్జున్. మీ కృషి, అంకిత భావం నుంచే నేను స్ఫూర్తి పొందాను. మీరు ఎప్పుడు ఇంతే గొప్పగా ఉండండి’’ అని యశ్ పోస్ట్ పెట్టాడు. ‘‘థ్యాంక్ యూ సర్’’ అంటూ శ్రీ నిధి శెట్టి రిప్లై ఇచ్చింది. ‘‘మీరు సినిమాను మెచ్చుకోవడం చాలా పెద్ద విషయం. మీ ప్రోత్సాహానికి థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్’’ అని ప్రశాంత్ నీల్ స్పందించాడు. ‘‘థ్యాంక్ యూ అల్లు అర్జున్. నేను నీకు పెద్ద అభిమానిని. ‘పుష్ప’ లో నీ నాటన నాకెంతో ఇచ్చింది. అటువంటి చిత్రాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా’’ అని రవీనా టండన్ స్పందించింది. 











Updated Date - 2022-04-23T02:43:27+05:30 IST