Allu Arjun: బన్నీ బాబు కాదు బ్రాండ్ బాబు

ABN , First Publish Date - 2022-07-29T02:58:13+05:30 IST

‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. ‘పుష్ప 2’ (Pushpa 2)తో ఇండియాని మరోసారి షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘పుష్ప’ రిలీజై

Allu Arjun: బన్నీ బాబు కాదు బ్రాండ్ బాబు

‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. ‘పుష్ప 2’ (Pushpa 2)తో ఇండియాని మరోసారి షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘పుష్ప’ రిలీజై ఎనిమిది నెలలు గడుస్తున్నాయి. బన్నీ అసలు ఏం చేస్తున్నాడా? అని చూస్తే బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ యాడ్స్ షూట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. స్టైల్ అండ్ స్వాగ్‌‌కి నిలువెత్తు రూపంలా ఉండే బన్నీ, ఆఫ్ స్క్రీన్ కూడా కూల్ లుక్స్‌తో కనిపిస్తూ ఉంటాడు. అందుకే బ్రాండ్స్ ఎక్కువగా అల్లు అర్జు‌న్‌తో కోలాబొరేట్ అవుతున్నాయి. 


రీసెంట్‌గా త్రివిక్రమ్‌ (Trivikram)తో యాడ్ షూట్ చేసిన అల్లు అర్జున్, ఇప్పుడు హరీష్ శంకర్‌ (Harish Shankar)తో మరో యాడ్ చేస్తున్నాడు. ఈ రెండు ఎండార్స్మెంట్స్ కూడా ‘పుష్ప’ రిలీజ్ తర్వాత వచ్చినవే అని  తెలుస్తోంది. ఆ సినిమా పాన్ ఇండియాలో పెద్ద సక్సెస్ అవ్వడం.. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో అసాధారణమైన వసూళ్లు రాబట్టడంతోనే నయా బ్రాండ్‌లన్నీ బన్నీ వెంట పడుతున్నాయి. త్రివిక్రమ్ ఈ యాడ్ కోసం 45 లక్షలు తీసుకున్నాడు అంటే ఇక అల్లు అర్జున్ ఎంత తీసుకున్నాడో లెక్కేయడం కూడా కష్టమే. అలాగే హరీష్ శంకర్ షూట్ చేస్తున్న బ్రాండ్ ప్రమోషన్‌కి కూడా బన్నీ బాగానే చార్జ్ చేస్తున్నాడట. ప్రస్తుతం తెలుగులో ఎక్కువ శాతం బ్రాండ్స్ బన్నీ తోనే టైఅప్ అయ్యాయి. 


ఈ లెక్కన చూస్తుంటే.. బన్నీ సినిమాలు లేకుండా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ‘పుష్ప ది రైజ్’కే బన్నీ దగ్గరికి ఇన్ని బ్రాండ్స్ వస్తే.. ఇక ఫైర్‌తో బన్నీనే ఒక బ్రాండ్ అవుతాడేమో. ఇదే జరిగితే అప్పుడు ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రౌడ్‌గా ‘తగ్గేదే లే’ అంటాడేమో. మొత్తానికి బన్నీబాబు కాస్త.. ఇప్పుడు బ్రాండ్ బాబుగా మారిపోయాడంటూ.. అల్లు అర్జున్‌పై కామెంట్స్ పడుతుండటం విశేషం. ఇక హరీష్‌తో చేస్తున్న బ్రాండ్ విషయంలో బన్నీ లుక్ అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ బ్రాండ్‌కి సంబంధించి.. బన్నీ ప్రీ లుక్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనాలను క్రియేట్ చేస్తోంది.



Updated Date - 2022-07-29T02:58:13+05:30 IST