Rangamarthanda : నేపథ్య సంగీతాన్ని మొదలు పెట్టిన Maestro

ABN , First Publish Date - 2022-06-08T19:47:34+05:30 IST

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishnavamshy) తాజా చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్రధాన పాత్రలో నటిస్తుండగా .. రమ్యకృష్ణ (Ramyakrishna), బ్రహ్మానందం (Brahmanandam), అనసూయ (Anasuya), శివాత్మికా రాజశేఖర్ (Shivatmika Rajasekhar) ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Rangamarthanda : నేపథ్య సంగీతాన్ని మొదలు పెట్టిన Maestro

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishnavamshy) తాజా చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రమ్యకృష్ణ (Ramyakrishna), బ్రహ్మానందం (Brahmanandam), అనసూయ (Anasuya), శివాత్మికా రాజశేఖర్ (Shivatmika Rajasekhar) ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  మరాఠీ సూపర్ హిట్ చిత్రం ‘నటసమ్రాట్’ (Natasamrat) కిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ లో నానా పాటేకర్ (Nana Patekar) పోషించిన పాత్రను ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ చేస్తున్నారు. 


నటసామ్రాట్ బిరుదునందుకొన్న ఓ నాటక కళాకారుడి జీవితానుభవాల్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నారు. నాటకరంగంలో విశేషమైన అనుభవాన్ని గడించి.. వర్తమానంలో కుటుంబ సమస్యల వల్ల కష్టాలు పడుతున్న ఓ వ్యక్తి కథ ఈ సినిమా. రంగమార్తాండగా ప్రకాశ్ రాజ్ అద్భుతంగా నటిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే..  ఈ సినిమాలో బ్రహ్మానందం ఇదివరకు చేయని పాత్రతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా ఆకట్టుకోబోతున్నారని సమాచారం. ప్రకాష్ రాజ్ భార్యగా రమ్యకృష్ణ సటిస్తుండగా.. కూతురిగా శివాత్మికా రాజశేఖర్ నటిస్తోంది. 


ఇటీవల టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి  ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం తమ తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశారు. అలాగే. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) ప్రస్తుతం  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీరికార్డింగ్ రాజాగా పేరు తెచ్చుకున్న ఇళయరాజా.. ఇలాంటి ఎమోషనల్ మూవీకి ఏ స్థాయిలో బీజీయం (BGM) అందిస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పాజిటివ్ బజ్ నడుస్తోంది. అతి త్వరలోనే సినిమాకి విడుదల తేదీని ప్రకటించబోతున్నారు మేకర్స్. మరి ‘రంగమార్తాండ’ గా ప్రకాశ్ రాజ్ ఏ స్థాయిలో అభినయిస్తారో చూడాలి.



Updated Date - 2022-06-08T19:47:34+05:30 IST