‘‘నా శరీరంలో మార్పులు చూసి... నీకు వయస్సు అయిపోయిందని అన్నారు!’’

ABN , First Publish Date - 2021-10-08T00:04:26+05:30 IST

సినిమా సెలబ్రిటీగా పేరు తెచ్చుకోవటం చాలా గొప్ప విషయమే. అందువల్ల ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఖాతాలో పడుతుంది. కానీ, ఎంత డబ్బు, పేరు వస్తుందో... అంతే మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. అదే విషయాన్ని తాజాగా ప్రియాంక చోప్రా చెబుతోంది.

‘‘నా శరీరంలో మార్పులు చూసి... నీకు వయస్సు అయిపోయిందని అన్నారు!’’

సినిమా సెలబ్రిటీగా పేరు తెచ్చుకోవటం చాలా గొప్ప విషయమే. అందువల్ల ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఖాతాలో పడుతుంది. కానీ, ఎంత డబ్బు, పేరు వస్తుందో... అంతే మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. అదే విషయాన్ని తాజాగా ప్రియాంక చోప్రా చెబుతోంది.


ఓ ఇంటర్వ్యూలో... గ్లోబల్ స్టార్ ప్రియాంక తనకు సొషల్ మీడియా, ఇంటర్నెట్ నుంచీ ఎదురైన అనుభవం గురించి ప్రస్తావించింది. ఆమె తండ్రి చనిపోయాక బాధలో మునిగిపోయిందట. అప్పుడు ఉపశమనం కోసం ఆహారంపై నియంత్రణ కాస్త సడలించిందట. నచ్చిన పదార్థాలు తినేయటంతో ‘శరీర ఆకారం’ మారింది. వెంటనే నెటిజన్స్ నుంచీ ‘‘నువ్వు డిఫరెంట్‌గా కనిపిస్తున్నావ్, నీకు వయసైపోతోంది’’ లాంటి కామెంట్స్ ఎదురయ్యాయట.


తండ్రిని కోల్పోయిన దు:ఖంలో ఉన్న ప్రియాంక ఆన్‌లైన్ కామెంట్స్‌తో మానసికంగా మరింతగా కృంగిపోయిందట. అప్పట్నుంచీ తనలోకి తాను మరింతగా ముడుచుకుపోయానని పీసీ వివరించింది. రెండేళ్ల చీకటి తరువాత ఎట్టకేలకు మరోసారి ఆమె శారీరికంగా, మానసికంగా ఉత్తేజాన్ని పొందిదట. ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో, అంతర్జాతీయ బ్రాండ్స్‌కి ప్రచారంతో ఫుల్ జోష్‌లో ఉంది మిసెస్ జోనాస్!


Updated Date - 2021-10-08T00:04:26+05:30 IST