ARYAN KHAN అరెస్ట్ : ఆ BJP కార్యకర్తే కారణమా?

ABN , First Publish Date - 2021-10-07T23:25:44+05:30 IST

బీజేపీ పార్టీకి, షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌కి ఎలాంటి సంబంధం లేదని మనీశ్ భానుశాలీ వ్యాఖ్యానించాడు. ఆయన ఆర్యన్‌తో పాటూ అరెస్ట్ అయిన మరో నిందుతుడు అర్భాజ్ మర్చెంట్‌తో పాటూ కెమెరాలకు కనిపించాడు.

ARYAN KHAN అరెస్ట్ : ఆ BJP కార్యకర్తే కారణమా?

బీజేపీ పార్టీకి, షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌కి ఎలాంటి సంబంధం లేదని మనీశ్ భానుశాలీ వ్యాఖ్యానించాడు. ఆయన ఆర్యన్‌తో పాటూ అరెస్ట్ అయిన మరో నిందుతుడు అర్భాజ్ మర్చెంట్‌తో పాటూ కెమెరాలకు కనిపించాడు. ఎన్సీబీ రైడ్స్ సమయంలో మనీశ్ కూడా క్రుయిజ్ షిప్‌లోనే ఉన్నాడు. అయితే, బీజేపీ కార్యకర్తగా ప్రచారం అవుతోన్న ఆయన ఉప్పు అందించటం వల్లే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యన్ సహా మరికొందర్ని అరెస్ట్ చేశారని ప్రస్తుతం ముంబైలో టాక్ నడుస్తోంది. ఆ విషయాన్ని మనీశ్ కూడా అంగీకరించటం విశేషం! 


‘‘అక్టోబర్ ఒకటిన నాకు డ్రగ్స్ పార్టీ జరగబోతోందని సమాచారం అందింది. అదే విషయాన్ని నేను అధికారులకి చెప్పాను. ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఆ పని చేశాను’’ అంటూ వివరించాడు భానుశాలీ. తన వ్యవహారానికి, బీజేపీ పార్టీకి సంబంధం లేదని కూడా ఆయన అంటున్నాడు. 


మరోవైపు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మలిక్ ట్విట్టర్‌లో రెండు వీడియోలు పోస్ట్ చేశాడు. ఆయన ఆరోపణ ప్రకారం శనివారం రాత్రి మనీశ్ భానుశాలీతో పాటూ మరో ప్రైవేట్ డిటెక్టివ్ కూడా ఎన్సీబీ ఆఫీస్‌కు వచ్చారట. ఆ తరువాతే, ఆర్యన్ ఖాన్‌తో పాటూ అతడి స్నేహితుడు అర్భాజ్ మర్చెంట్ సహా మొత్తం ఎనిమిది మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-10-07T23:25:44+05:30 IST